/rtv/media/media_files/2025/01/22/pJ02PakpeRy31abH4dwi.jpg)
highest watched ott movies
OTT Movies: ప్రస్తుత జనరేషన్ లో ఓటీటీల ఆదరణ పెరిగిపోతోంది. సినిమాలు, షోలు, సీరీస్ లు ఇలా రకరకాల కంటెంట్ తో ఈ బిజీ లైఫ్‌కు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో దొరుకుతోంది. ప్రతీ ఏడాది ఓటీటీ కంటెంట్ ను చూసేవారి సంఖ్య గమనీయంగా పెరుగుతోంది. అయితే తాజాగా ఆర్‌మ్యాక్ మీడియా గతేడాది వివిధ ఓటీటీ వేదికల్లో అత్యంత వీక్షణాలను సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Sankranthiki Vasthunam: రికార్డు వసూళ్లతో దుమ్మురేపుతున్న వెంకీ మామ.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే!
మీర్జాపూర్ టూ మిడిల్ క్లాస్
2024లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సీరీస్ గా 'మీర్జాపూర్' రికార్డు సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ ను 30.8 మిలియన్ల వీక్షణాలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 'పంచాయత్3' సీరీస్ ని 28.2 మిలియన్ల మంది వీక్షించారు. 'హీరామండి: ది డైమండ్ బజార్' 21.5 మిలియన్ వ్యూస్ తో 3 స్థానంలో ఉంది. దోపత్తి (15.1 మిలియన్), సెక్టార్ 36 (13.9మిలియన్) , సికిందర్ కా ముకద్దార్ (13.5మిలియన్) వ్యూస్. అత్యధికంగా వీక్షించిన టాప్ 15 సినిమాల్లో 11 చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనవే. ఇక తమిళ్ తెలుగు భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్ టాప్‌లో ఉంది.
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
ప్రాంతీయ భాషల్లో 2024లో 'సేవ్ ది టైగర్స్: సీజన్2' సీరీస్ ను అత్యధికంగా 5 మిలియన్ల మంది వీక్షించారు. ఆ తర్వాత ప్రభాస్ 'బుజ్జి అండ్ భైరవ' షోను 4.9 మిలియన్ల మంచి చూశారు. తమిళంలో ఇన్‌స్పెక్టర్ రిషి సీరీస్ ను అత్యధికంగా వీక్షించారు. వీటితో పాటు 'స్క్విడ్ గేమ్2' , 'హౌస్ ఆఫ్ డ్రాగన్2' ఇంటర్ నేషనల్ కంటెంట్ కి కూడా ప్రాంతీయంగా భారీ ప్రేక్షకాదరణ లభించింది. అలాగే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న #90’s A Middle-Class Biopic అత్యధిక మంది లైక్ చేసిన సీరీస్ గా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంది.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!