/rtv/media/media_files/2025/02/27/w8VKuHTs94AXR7Gua9hI.jpg)
NTR 31 Movie Prashanth Neel Searching locations on Kakinada Uppada Beach Photograph: (NTR 31 Movie Prashanth Neel Searching locations on Kakinada Uppada Beach )
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం రాబోతుంది. ‘ntr31’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మేకర్స్ కూడా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వస్తున్నారు. అయితే చిత్రబృందం ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో పడింది. ఈ పనులు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
కాకినాడకు నీల్
ఈ షెడ్యూల్‌లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేశారు. అల్లర్లు, రాస్తారోకో సీన్స్‌తో సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇక దీని తర్వాత మూవీ యూనిట్ కాకినాడ లోని ఉప్పాడ బీచ్‌లో దర్శనమిచ్చింది. అక్కడి పరిసర ప్రాంతాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించాడు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
#PrasanthNeel Shoot start cheyaka mundhu Visit Chesina Location Kakinada, Uppada Beach🔥@tarak9999 anna scenes max undavu anukunta
— Mani🔥 #Devara (@ManiNTR1999) February 26, 2025
Movie Ramp anthey KGF1 ramge movie padithay matram 🔥🔥💥💫
#NTRNeel pic.twitter.com/MXShnVT0W8
అందిన సమాచారం ప్రకారం.. షిప్పింగ్‌తో పాటు తదితర సన్నివేశాలకు సంబంధించిన సీన్లను ఈ బీచ్‌లో షూట్ చేయనున్నట్లు తెలిసింది. అందువల్లనే ప్రశాంత్ నీల్ ఉప్పాడ బీచ్‌లో కొన్ని ప్రదేశాలను పరిశీలించారు. ఆయన బీచ్ లోకేషన్స్ చూసేందుకు వెళ్లిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
అందులో ప్రశాంత్ నీల్ బీచ్ ఒడ్డున మొబైల్‌తో లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నట్లు కనిపించింది. అలాగే మరోక వీడియోలో అతడు సమీప గ్రామస్థులను కలిసినట్లు కనిపించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సముద్ర సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటే ఇక రచ్చ రచ్చే అని తెగ సంబరపడిపోతున్నారు.