/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chiru-jpg.webp)
తాను ఎవరిని కలిసినా..రాజకీయ పెద్దలను కలిసేది సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమేనని అన్నారు మెగాస్టార్ చిరంజివీ. తన జీవితంలో ఇక రాజకీయాలకు చోటు లేదని చెప్పేశారు. బ్రహ్మానందం ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరు ఈ ప్రకటన చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని తన తమ్ముడు పవన్ కల్యాణ్ నెరవేరుస్తారని చెప్పారు.
సమస్యే లేదు...ఇక వెళ్ళను..
ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు. రాజకీయ నాయకులను కలుస్తానని...వాళ్ళతో తన అనుబంధం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కానీ అదంతా సినీ అవసరాల దృష్ట్యానే జరుగుతుందని తెలిపారు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలోనే మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ల దగ్గరవుతున్నారు అటు వైపు వెళ్తాడా అని, అటువంటి డౌట్ వద్దని చిరు చెప్పారు.
రాజకీయాల్లో కి మళ్లీ నా జీవితంలో రాను - చిరంజీవి
— Telugu360 (@Telugu360) February 11, 2025
ఈ మధ్య పెద్ద వాళ్ళకి దగ్గర అవడం చూసి ఊహాగానాలు వస్తున్నాయి, అవి అన్నీ తుడిచేయండి.. నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను
వీడియో: pic.twitter.com/3cYC5gMLW4
అంతకు ముందు విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ లో కూడా చిరు మాట్లాడారు. నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. తాను మొదటి నుంచి ఇండస్ట్రీ లో అందరూ కలిసి ఉండేలా కృషి చేస్తూనే ఉన్నాను. ఒక సినిమా ఆడితే వందల మంది బాగుంటారు. పుష్ప 2 సినిమా ఆడితే గర్వపడ్డాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు గా ఉంటారు. ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్ అంటూ మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. మొదటిసారి పుష్ప సినిమా గురించి బహిరంగంగా స్పందించారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: లక్కీ లేడీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు హగ్ ఇచ్చిన కోహ్లీ: వీడియో వైరల్!