నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్నతాజా చిత్రం "డాకు మహారాజ్". ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల చేయగా.. వాటికీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్ The New Year gets its MASS DHAMAKA 😎Set to turn theatres into electrifying concerts! 💥#DaakuMaharaaj 𝟑𝐫𝐝 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 on 4th Jan (USA) & 5th Jan (India) 🔥A @MusicThaman Mass Blast! 💥ఇంకా దబిడి దిబిడే…🥁🕺🏻𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol… pic.twitter.com/v3tV9dMZUC — Sithara Entertainments (@SitharaEnts) December 29, 2024 ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. బాలయ్య ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ గా "డాకు మహారాజ్" నుంచి ఊర మాస్ సాంగ్ రాబోతుంది. ఈ మేరకు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా.. జనవరి 4 న యూ.ఎస్ లో మరునాడు ఇండియాలో థర్డ్ సింగిల్ ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. దబిడి దిబిడే.. ఇదొక మాస్ బ్లాస్ట్ సాంగ్ అని, ఈ సాంగ్ తో దబిడి దిబిడే అంటూ పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్ లో బాలయ్యతో పక్కనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా మాస్ స్టెప్పులేస్తూ కనిపించింది. ఈ ఒక్క పోస్టర్ తో పాటపై అంచనాలు పెరిగిపోయాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ సినిమా. Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్ ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత థమన్ మరోసారి ఈ సినిమాలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ క్రియేట్ చేయనున్నారు.