NC24 First Look: చైతూకు సపోర్ట్ గా మహేశ్ బాబు.. NC24 టైటిల్ రిలీజ్!

నాగ చైతన్య నటిస్తున్న NC24 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను నవంబర్ 23న ఉదయం 10:08కి సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేయనున్నారు. కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథికల్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌధరి హీరోయిన్, స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ గా నటిస్తున్నారు.

New Update
NC24 First Look

NC24 First Look

NC24 First Look: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న కొత్త మైథికల్ థ్రిల్లర్,  NC24 చిత్రానికి సంబంధించిన పెద్ద అప్డేట్ వచ్చేసింది. చైతూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఎవరో కాదు… మన సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) విడుదల చేయనున్నారు.

Also Read :  'వార్ 2' పై హృతిక్ రోషన్ ట్రోల్స్.. అంత మాట అనేశాడేంటి..?

NC24 Title And First Look Released By Mahesh Babu

నవంబర్ 23 ఉదయం 10:08 గంటలకు చైతన్య బర్త్‌డే సందర్భంగా మహేశ్ బాబు NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తారు. దింతో సోషల్ మీడియాలో భారీ హైప్ మొదలైంది.

సినిమా యూనిట్ విడుదల చేసిన ప్రీ-అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మహేశ్ బాబు, నాగ చైతన్య ఇద్దరూ షాడో లుక్‌లో కనిపించడం మరింత ఆసక్తి పెంచింది. “గ్లోబ్‌ట్రాటర్ తీసుకురాబోయే ట్రెజర్ హంటర్” అంటూ చేసిన ఈ ప్రచారం, సినిమా కాన్సెప్ట్‌పై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

NC24లో నాగ చైతన్య ఒక ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. మైథికల్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌధరి నటిస్తున్నారు. అలాగే లాపతా లేడీస్ చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. యువ డైరెక్టర్ కార్తిక్ దండు (వీరుపాక్ష) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో గ్రాఫిక్స్, యాక్షన్, మైథికల్ ఎలిమెంట్స్ అన్నీ టాప్ నాచ్‌గా ఉండబోతున్నాయని సినిమా యూనిట్ చెబుతోంది.

చైతన్య కెరీర్‌లో ఇదొక కొత్త జానర్ సినిమా అవుతుందని, టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మైథికల్ థ్రిల్లర్స్ హిట్ అవుతున్న ఈ సమయంలో, NC24 కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

మొత్తం మీద, మహేశ్ బాబు విడుదల చేయబోయే ఫస్ట్ లుక్‌కి చైతూ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం టాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Also Read :  పవన్ కల్యాణ్ - దిల్ రాజు మూవీ ఫిక్స్.. టైటిల్ ఏంటంటే..?

Advertisment
తాజా కథనాలు