Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై నందమూరి కల్యాణ్‌రామ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’లో ఆమె కొడుకుగా నటించడం గొప్పగా అనిపించిదన్నాడు. ఆమెను ఎప్పుడైనా మేడం కాదు అమ్మా అనే పిలుస్తానని చెప్పాడు.  

author-image
By srinivas
New Update
kalyan ram

Nandamuri Kalyanram interesting comments on Vijayashanti

Kalyan Ram: నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతిపై నందమూరి కల్యాణ్‌రామ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా త్వరలోనే విడుదలకానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన కళ్యాణ్ రామ్.. ఇందులో ఓ కీలక పాత్ర పోషించిన విజయశాంతితో తనకు ఏర్పడిన బంధం గురించి చెప్పాడు. ఈ మేరకు ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ మధ్య తల్లీకొడుకుల బంధం ఏర్పడినట్లు తెలిపాడు. 

చాలా విషయాల్లో గొడవ..

'తల్లీకొడుకు చాలా విషయాల్లో గొడవ పడతారు. చివరకు ఒక్కటవుతారు. కానీ ఈ సినిమాలో ప్రేమగా ఉండే తల్లీకొడుకులు అనూహ్యంగా దూరం అవుతారు. మళ్లీ ఎలా కలుసుకున్నారనేది చాలా కీలకం. డైరెక్టర్ ప్రదీప్‌ ఈ స్టోరీ చెప్పినపుడు తల్లి పాత్రలో విజయశాంతినే ఊహించుకున్నా. నేను ఆమెను విజయశాంతి గారు అనను. మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుస్తా. ఈ సినిమాకు స్ఫూర్తి ‘కర్తవ్యం’. అందులో వైజయంతి పాత్రకు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర పాయింట్‌తో ఈ కథను నిర్మించాం' అని చెప్పుకొచ్చాడు. 

Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

ఇక ఈ మూవీ గురించి మాట్లాడిన విజయశాంతి.. 'చాలామంది కొత్త దర్శకులను కల్యాణ్‌ రామ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మొదటి ప్రయత్నంలోనే గొప్ప విజయం అందుకున్నారు. ఈ సినిమా ప్రదీప్‌కు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుంది. కల్యాణ్‌ రాజీపడకుండా నటించడం గొప్పగా అనిపించింది' అంటూ పొగిడేసింది. ఇక ఈ మూవీ టీజర్‌ సోమవారం ఉదయం రిలీజ్ చేయనున్నారు. 

Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు