గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' విడుదలకు సిద్ధమవుతోంది. 'వాల్తేరు వీరయ్య' బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు బాబీ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సమావేశంలో నిర్మాత నాగవంశీ, దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొన్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 'దబిడి దిబిడి' సాంగ్ కొన్ని వివాదాలను ఎదురుకొన్న విషయం తెలిసిందే. Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్ #NagaVamsi reply about #DabidiDibidi step at #DaakuMaharaaj press meet😂🤣pic.twitter.com/xmqawQJe30 — 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) January 7, 2025 ముఖ్యంగా ఈ పాటలో ఊర్వశి రౌతేలాను బాలయ్య బ్యాక్ నుంచి కొట్టడం వివాదాస్పదమైంది. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్..' దిబిడ్ సాంగ్ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టా లేదా.. నాగవంశీ ఇంట్రెస్టా? అని ప్రశ్నించగా, దీనికి నాగవంశీ మాట్లాడుతూ.. ఊర్వశిని కొట్టింది నేనా. నేను కొట్టాను అంటే మీరు అడిగితే వేరు. కానీ బాలయ్య కొడితే అందులో నా ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుందండి అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు. అయితే ఊర్వశిని కాకుండా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లను ఈ సాంగ్‌లో పెట్టవచ్చు కదా అంటే.. వాళ్లు కొట్టించుకోము అన్నారు అందుకే ఊర్వశిని పెట్టాము అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ