రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి 'దబిడి దిబిడే'.. 'డాకు మహారాజ్' పై నిర్మాత పోస్ట్

బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.' సినిమా సెకండాఫ్ లో ఓ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులు గుర్తు చేస్తుంది. ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి..' అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

New Update
nagavamsi on daku maharaj

nagavamsi on daku maharaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. బాలకృష్ణ కెరీర్‌లో 109వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ సంయుక్తంగా నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

శ్రద్ద శ్రీనాధ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా కనిపించనుండగా, చాందినీ చౌదరి మరియు ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Also Read : అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు నోరు విప్పిన జానీ మాస్టర్.. ఏం చెప్పారంటే?

మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న వేళ నిర్మాత నాగవంశీ.. సినిమాపై పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగవంశీ తన పోస్ట్‌లో.. " మీకు 'సమరసింహా రెడ్డి'లోని పవర్‌ఫుల్ యాక్షన్ గుర్తుందా? ఆ సినిమా నిజమైన మాస్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ఇప్పుడు 'డాకు మహారాజ్' సెకండాఫ్ లో ఒక సీక్వెన్స్ ఉంది, ఆ సీక్వెన్స్ మిమ్మల్ని మరోసారి సమరసింహా రెడ్డి రోజులను గుర్తుకురావడమే కాదు మీకు అదే ఊపునిస్తుంది. 

Also Read : యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న జాతర సాంగ్.. ఫుల్ వీడియో చూశారా?

ఈ సంక్రాంతికి థియేటర్స్ మోత మోగుతాయి. దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్.." అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ  ట్రైలర్ జనవరి 5న విడుదల కానుంది. గతేడాది సంక్రాంతికి 'వీరసింహారెడ్డి' తో మాస్ హిట్ అందుకున్న బాలయ్య.. ఈ ఏడాది 'డాకు మహారాజ్' తో దాన్ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి 

#latest-telugu-news #daku maharaj #producer-nagavamsi #balayya #latest-movie-updates
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు