Cinema: సినిమా ఎలా ఉన్నా మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది..తండేల్ ట్విట్టర్ రివ్యూ

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.  తండేల్ మ్యాజిక్ క్రియేట్ చేసిందని చెబుతున్నారు. అన్నింటికంటే డీఎస్పీ మ్యూజిక్ రాక్ చేసిందని అంటున్నారు. 

New Update
cinema

Thandel Movie

కాస్త క్లైమాక్స్ దెబ్బ కొట్టింది కానీ ఓవరాల్ గా సినిమా అంతా బావుందని అంటున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంట మళ్ళీ అదరగొట్టిందని చెబుతున్నారు. నాగ చైతన్య ప్రస్టేజియస్ గా తీసుకున్న సినిమా తండేల్ అటు ఓవర్సీస్ లోనూ...ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి షోలు పడిపోయాయి. అంచనాలకు తగ్గట్టే సినిమా ఉందని అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా దేవీశ్రీ ఈస్ బ్యాక్ అని చెబుతున్నారు. సినిమా కాస్త స్లోగా ఉంది కానీ నెమ్మదిగా జనాలకు ఎక్కేస్తుందని అంటున్నారు. పాటలు ఎంత బాగున్నాయో ఆర్ఆర్ అంతకు మించి ఉందని చెబుతున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని ట్విట్టర్ లో రివ్యూలు పెడుతున్నారు. బుజ్జి తల్లి పాట తెరపై చూడటానికి రెండు కళ్లు చాలవేమో అన్నట్టుగా ఉందని రాస్తున్నారు. 

తండేల్ సినిమా మత్య్సకారులకు సంబంధించినది. శ్రీకాకుళం నుంచి వెళ్ళినవారు పాకిస్తాన్ కు చేరుకుని అక్కడ ఎలా ఇరుక్కుపోయారు. అక్కడ నుంచి వారిని భారతదేశ ప్రభుత్వం ఎలా విడిపించుకొచ్చింది అన్నదే కథ. దాంతో పాటూ ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి మధ్య లవ్ కూడా ఉంది. లవ్ సాంగ్స్ కు పెట్టింది పేరైనా డీఎస్పీ తండేల్ సినిమాకు ప్రాణం పెట్టేశాడని చెబుతున్నారు. చాలా గ్యాప్ తరువాత అదిరిపోయే లవ్ సాంగ్స్ ఇచ్చాడు. ఇక ఇందులో ఆర్ఆర్ కూడా దేవీ శ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడని చెబుతున్నారు. పాటలు తెరపై విజువల్ ట్రీట్‌ ఇస్తున్నాయని పోస్ట్ లు పెడుతున్నారు. 

పాజిటివ్ రివ్యూస్ ఇలా ఉంటే...వాటికి తగ్గట్టే నెగటివ్ రివ్యూస్ కూడా సమానంగా వస్తున్నాయి. చందూ మొండేటి సినిమా మొత్తాన్ని సర్వనాశనం చేశాడని కొందరు పోస్టులు పెడుతున్నారు. మొత్తం సినిమా చాలా నీరసంగా తీశాడని అంటున్నారు. అయితే సాయి పల్లవి తన పాత్రకు న్యాయం చేసిందని, నాగ చైతన్య కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇదే అని మాత్రం కితాబులిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే ఎమోషన్్తో నడిపించేశారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందని రాస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు