/rtv/media/media_files/2025/03/18/ife3X8TdnCJHUk0BKWoM.jpg)
MS Dhoni and Sandeep Reddy Vanga
MS Dhoni and Sandeep Vanga: ధోని.. ఈ పేరు వింటే క్రికెట్ ప్రియుల్లో గూస్ బంప్స్ వస్తాయి. అతడు బ్యాట్ పడితే స్టేడియం దద్దరిళ్లుతుంది. ధోని అంటే క్రికెట్ అభిమానుల్లోనే కాదు.. సినీ ఫ్యాన్స్‌లోనూ పిచ్చ క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ధోని స్టేడియంలో బ్యాట్ పడితే చూద్దామని కొందరు.. ధోని స్టైలిష్‌గా తెరపై కనిపిస్తే చూడాలని ఇంకొందరు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఊరమాస్ డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగా తన పేరును లిఖించుకున్నాడు. గతేడాది యానిమల్ సినిమాతో నార్త్‌లో పాగా వేశాడు. అందులో హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
ధోని-సందీప్ వంగా
మరి అలాంటి మాస్ డైరెక్టర్ సందీప్, స్టార్ క్రికెటర్ ధోని కలిసి ఒక సినిమా చేస్తే ఎట్లుంటది. అది ఊహించుకోవడానికే అంతుచిక్కదు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ఎంతో మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. కానీ అది సినిమాగా కాదు.. ఒక యాడ్‌గా. ఈ యాడ్‌కు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ధోని మెయిన్ లీడ్‌లో కనిపించి అదరగొట్టేశాడు. ఆ ప్రోమో చూస్తే మతిపోవాల్సిందే.
My favourite animal is when DHONI remembers who he is 🔥 pic.twitter.com/Jgr3MDO28f
— EMotorad (@e_motorad) March 18, 2025
Also Read: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
యాడ్ కోసం జత
అయితే ఈ-మోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్స్ కోసం వీరిద్దరూ జతకట్టారు. ఈ యాడ్‌లో ధోని ఊరమాస్ లుక్కు ఓ రేంజ్‌లో ఉంది. హీరోకు తీసిపోని అవతారాన్ని దర్శకుడు సందీప్ క్రియేట్ చేశాడు. MS ధోని తన క్రికెట్ కెరీర్ తొలినాళ్లలో తలవెనుక పొడుగాటి జుట్టుతో ఉండేవాడు. ఇప్పుడు క్రేజీగా అదే లుక్‌ను మేకోవర్ చేశారు.
Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి
యాడ్ ప్రారంభంలో.. వరుసగా నాలుగు కార్లు రయ్ రయ్ మంటూ వస్తాయి. అందులోంచి ధోని స్టైలిష్‌గా, కళ్లకు నల్లని గాగుల్స్, బ్లూ కోట్‌తో కారు డోర్ తీసుకుని దిగుతాడు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చి చించేసాడు. నోట్లో టూత్ పిక్ పెట్టుకొని ఒక లుక్ వేయగానే.. తన బాడీ గాడ్స్ గన్స్ పట్టుకొని ధోని వెంట వెళతారు. అదే సమయంలో ధోని సైకిల్‌ను నడిపించుకుంటూ వెళ్లడం ఆ యాడ్‌లో చూడవచ్చు. అంతలోనే దర్శకుడు సందీప్.. కట్ కట్ అంటూ గట్టిగా ఓ విజిల్ వేస్తాడు. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అంటూ సందీప్ చెప్తాడు. ఇలా మొత్తంగా యాడ్ వీడియో అదిరిపోయిందనే చెప్పాలి.
Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!