సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన "గుంటూరు కారం" సినిమాలో నటించినప్పటికీ, ఈ సినిమాలో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ "గోట్" చిత్రంలో మంచి పాత్రలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో "లక్కీ భాస్కర్" సినిమాలో, దుల్కర్ సల్మాన్ సరసన చేసిన చిత్రం సూపర్ హిట్ అయింది. ఇందులో మీనాక్షి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుణ్ తేజ్ తో "మట్కా", విశ్వక్ సేన్ తో "మెకానిక్ రాకీ" చిత్రాలలో కూడా ఆమె నటించింది. తాజాగా, సంక్రాంతి సందర్భంగా విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది.
Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
గ్లామర్ తో యువతను ఆకర్షిస్తూ వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ మీనాక్షి దూసుకెళ్తోంది, ఈ అమ్మడు కెరీర్ ప్రారంభంలో కొన్ని ఫ్లాపులను కూడా ఎదుర్కొంది. ఆమె నటించిన "ఖిలాడీ" డిజాస్టర్ గా నిలిచింది, కానీ ఆమె గ్లామర్ లో మాత్రం రెచ్చిపోయింది.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
ప్రభాస్ పై క్రష్...
ఇటీవలి ఇంటర్వ్యూలో, మీనాక్షి తన క్రష్ గురించి ఓపెన్ గా చెప్పింది. ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై క్రష్ ఉన్నట్లు ప్రకటించింది. ప్రభాస్ తో నటించాలనే ఆమె ఆసక్తిని వ్యక్తం చేసింది. "ప్రతి హీరోకు తనదైన ప్రత్యేక శైలి ఉంటుంది, అందుకే అందరి హీరోలతో కూడా నటించాలనుకుంటున్నాను" అని ఆమె చెప్పింది.
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
"సంక్రాంతికి వస్తున్నాం" చిత్రంలో, మీనాక్షి వెంకటేష్ మాజీ ప్రేయసిగా, పోలీస్ అధికారి పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి.
Also Read: Baba Ramdev: బాబా రామ్‌దేవ్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ