/rtv/media/media_files/2025/03/17/oFfOL0SxZkex4rExrQdP.jpg)
Mammootty
హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తండ్రి, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి నెట్టింట రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి క్యాన్సర్ బారిన పడ్డారని.. అందుచేత చికిత్స కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
Also Read : ఆకాశానికి నిచ్చెన వేస్తున్న రష్యా.. లిఫ్ట్‌లో అంతరిక్షంలోకి!
టీమ్ క్లారిటీ
ఈ నేపథ్యంలో తాజాగా మమ్ముట్టి టీమ్ ఆయన ఆరోగ్యంపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మమ్ముట్టి రంజాన్ ఉపవాసం చేస్తున్నారు. ఆ కారణంతోనే ఆయన షూటింగ్ షెడ్యూల్స్ ని వాయిదా వేశారు. విరామం తర్వాత ఆయన మళ్ళీ మోహన్ లాల్, మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాలు సృష్టించవద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also Read : ఫలించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల పోరాటం.. TTD కీలక నిర్ణయం!
Isn’t it crazy how insensitive social media has gotten? No one seems to care if the news is actually true or not. I really hope Mammookka is doing okay. But seriously, if he’s not, let’s not spread any negativity about his health.#Mammootty pic.twitter.com/FZwJ9awYT8
— Sreenath Nandipulam (@moviesandsree) March 17, 2025
Also Read : ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!
మమ్ముట్టి ప్రస్తుతం మోహన్ లాల్ తో కలిసి మహేష్ నారాయణన్ దర్శకత్వంలో 'MMMN' అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార, ఫహద్ ఫాసిల్, కుంచకో బోబన్ , దర్శన రాజేంద్రన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో శ్రీలంకలో ప్రారంభమై అజర్‌బైజాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, థాయిలాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చిలలో చిత్రీకరణ జరగనుంది. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ (2023) చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మనుష్ నందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 16 సంవత్సరాల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కంటే ముందు, 2011లో మమ్ముట్టి, మొహలాల్ నటించిన క్రిస్టియన్ బ్రదర్స్ లో అతిధి పాత్ర పోషించారు. 2008 లో మల్టీస్టారర్ చిత్రం ట్వంటీ ట్వంటీలో ఇద్దరు కలిసి నటించారు.
Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?