/rtv/media/media_files/2025/01/14/8yB4nhIaQHzKc3A2eMsp.jpg)
SSMB 29 UPDATES
'SSMB-29' మూవీ గురించి రకరకాల వార్తలు(SSMB 29 Updates) వైరల్ అవుతూనే ఉన్నాయి. రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జక్కన్న చెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు మీసకట్టు, గడ్డం లుక్ లోకి మారిపోయాడు. మహేష్ న్యూ లుక్ తో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
Also Read : తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?
ఇక 'RRR'తో గ్లోబల్ సక్సెస్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు 'SSMB-29'తో హాలీవుడ్ రేంజ్ వండర్స్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే సీక్రెట్‌గా చాలా సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra), విలన్ క్యారక్టర్ లో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) నటించనున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
'SSMB-29'లో 'వెంకీ మామ'
ఇప్పుడు, మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఇంకో న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక కొత్త అప్‌డేట్ తాజాగా లీక్ అయ్యింది. మహేష్ బాబుకు అన్నగా మన 'వెంకీ మామ' నటించనున్నారని తెలుస్తోంది.
మహేష్ బాబు, వెంకటేష్(Venkatesh) కాంబో గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పుడు మళ్ళీ 'SSMB-29' గురించి వస్తున్న ఈ వార్త నిజమైతే, 'మహేష్-వెంకీ' క్రేజీ కాంబో మరోసారి నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం మాత్రం పక్కా.
Also Read : బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే!