Cinema: సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో చిన్నోడు సందడి

సంక్రాంతికి వస్తున్నాం వందకోట్ల సెలబ్రేషన్స్ పార్టీలో చిన్నోడు మహేష్ బాబు సందడి చేశారు. తన భార్య నమ్రత, ఫ్రెండ్, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మూవీ టీమ్‌ను అభినందించారు. చిత్ర బృందంతో ఆయన కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

author-image
By Manogna alamuru
New Update
సినిమా

సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో మహేష్ బాబు, నమ్రత

ఈ నెల 14న పెద్ద పండుగ సినిమాల్లో భాగంగా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ విడుదల అయింది. కామెడీ బేస్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్ హి కొట్టింది. మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిపోయింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. తాజాగా చిత్ర బృందం మరొకసారి పార్టీ చేసుకుంది. దీంట్లో  సినిమా కాస్ట్ అంతా పాల్గొన్నారు వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. ఈపార్టీ స్పెషల్ గెస్ట్‌గా చిన్నోడు...అదే మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. తన భార్య నమ్రతతో కలసి పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీకి మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వచ్చారు.  ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈసినిమా గురించి మహష్ రీసెంట్‌గ ఒక పోస్ట్ పెట్టారు. సినిమా బావుంది అని...అసలైన పండగ సినిమా అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. వెంకటేశ్‌, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి, బుల్లిరాజు పాత్ర పోషించిన బాలుడి నటన అద్భుతమని కొనియాడారు.

movie

movie

movie

మూడు రోజుల్లోనే..

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమాలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి క్యూ కడుతున్నారు. దీంతో  కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘సంక్రాతికి వస్తున్నాం’ నిలిచింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లను నమోదు చేయగా, రెండో రోజు రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మూడో రోజుకి రూ. 29 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. 

Also Read: Telecom: స్పామ్ కాల్స్‌కు చెక్..సంచార్ సాథీ మొబైల్ యాప్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?

నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

New Update
HIT 3 new song

HIT 3 new song

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 

మూడో సాంగ్

ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్‌ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. 

Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు