/rtv/media/media_files/2025/03/18/uzKJeNNhSszyjL2EixhH.jpg)
MAD Square Vaccharroi Lyrical Song Released
Mad Square Song: గత ఏడాది విడుదలైన ‘మ్యాడ్’ మూవీ హుషారెత్తించే కామెడీతో సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించింది. ఒక చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీసును షేక్ చేసింది. కడుపుబ్బా నవ్వించే ఎంటర్‌టైన్‌మెంట్ అందించి కలెక్షన్ల(Collections) వర్షం కురిపించింది. కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
మరోసారి ఫుల్ ఫన్
ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కలిసి ప్రధాన పాత్రలో నటించి అదరగొట్టేశారు. సాంగ్స్, కామెడీ, స్టోరీ పర్ఫెక్ట్‌గా ఉండటంతో సినీ ప్రియులు థియేటర్లకు పరుగులు తీశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సీక్వెల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్‌లు మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తున్నారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి
ఫస్ట్ పార్ట్ కంటే మించిన కామెడీతో ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అన్ని పనులు చకచకా కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలకు సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఫుల్ కామెడీతో అదిరిపోయింది. మొత్తంగా అన్నీ పూర్తి చేసుకుని మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కో అప్డేట్ అందించి అదరగొట్టేస్తున్నారు.
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
మూడో సాంగ్ రిలీజ్
ఈ నేపథ్యంలోనే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఈ చిత్రం నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘వచ్చార్రోయ్’ అంటూ సాగే ఈ లిరియల్ సాంగ్ అందరినీ అలరిస్తుంది. ఈ పాటకు కేవీ అనుదీప్ లిరిక్స్ అందించారు. భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..