/rtv/media/media_files/2025/01/06/52XZPpoKclADaK4Ff1O6.jpg)
Good Bad Ugly release date announced
Good Bad Ugly: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రం చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్ తదితర నటీ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
Also Read : ఆ ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రిలీజ్ డేట్ ఖరారు
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అజిత్ లుక్ ఓ రేంజ్లో ఉంది. కుర్చీపై కూర్చొని గన్ పట్టుకున్న స్టైల్ అదిరిపోయిందనే చెప్పాలి. దీంతో ఈ పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
#GoodBadUgly arrives on April 10th❤️🙏🏻 @MythriOfficial @SureshChandraa pic.twitter.com/K6N1x7uANT
— Adhik Ravichandran (@Adhikravi) January 6, 2025
Also Read : ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఆ కంపెనీలు కూడా..!
మరోవైపు అదే రోజు ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇద్దరు స్టార్ల మధ్య బాక్సాఫీసు వార్ నడవనున్నట్లు తెలుస్తోంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, మాళవికా మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్..అసలేమైందంటే!
ఇక రెండు భాషల స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానుండటంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అజిత్ నటిస్తున్న సినిమా యాక్షన్, డ్రామాగా తెరకెక్కుతోంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న సినిమా లవ్ అండ్ హార్రర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో.
Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?