Kareena: ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి.. కరీనా సంచలన పోస్ట్!

భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కరీనా కపూర్‌ స్పందించారు. నెట్టింట ఓ నటుడు షేర్ చేసిన వీడియోను ఉద్దేశిస్తూ.. దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి అంటూ రిక్వెస్ట్ పోస్ట్ పెట్టారు. కాసేపటికే కరీనా ఆ పోస్టు డిలీట్ చేశారు. 

New Update
kareena kapoor

Saif Ali Khan, kareena kapoor

Kareena: భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కరీనా కపూర్‌ స్పందించారు. సైఫ్‌పై దాడికి సంబంధించి ఓ ఛానల్ టెలికాస్ట్‌ చేసిన వీడియోను ఓ నటుడు షేర్ చేయగా దానిపై ఇన్‌స్టాలో కరీనా రియాక్ట్ అయ్యారు. దయచేసి ఇలాంటివి ఆపండి, మమ్మల్ని వదిలేయండి అంటూ పోస్టులో రిక్వెస్ట్ చేశారు. అయితే కాసేటికే కరీనా ఆ పోస్టును ఇన్‌స్టా నుంచి డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. 

సంయమనం పాటించండి.. 

ఈ మేరకు నటుడు పోస్ట్ చేసిన వీడియోలో.. సైఫ్‌ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు బొమ్మలు తీసుకెళ్లున్నట్లు కనిపించింది. దీంతో మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్‌లు సంయమనం పాటించాలని ఆమె కోరారు. తన ఇంట్లో ఘటన చోటుచేసుకున్న రోజు కూడా ఈ విషయం చెప్పానని ఆమె గుర్తు చేశారు. ఆ రోజు తమకెంతో కఠినమైనదని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తాము కుదుటపడేందుకు కాస్త టైమ్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. 

ఇది కూడా చదవండి: Joe Biden: పదవీకాలం ముగియనున్న వేళ.. జో బైడెన్ కీలక నిర్ణయం

ముంబైలో ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడ్డాక ఆయనపై దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడ నలుగురు మగ పనిమనుషులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుండగుడు, సైఫ్‌కు మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ నలుగురు ఆపేందుకు ప్రయత్నించలేదు. భయంతో అక్కడే దాక్కున్నారు. అయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే ఒంటరిగా ఆ దుండగుడితో పోరాడినట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది.   

ఇది కూడా చదవండి: పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్‌ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దుండగుడికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలియదని పేర్కొన్నారు. 'అతడు ఒక దొంగ. బంగ్లాదేశ్‌కు చెందినవాడు. ముందుగా కోల్‌కతాకు చేరుకొని ఆ తర్వాత ముంబయికి వచ్చాడు. దొంగతనం చేసేందుకు ఓ ఇంటిని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే సైఫ్‌ ఇంట్లో చొరబడ్డాడు. అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అన్న విషయం ఆ దొంగకు తెలియదు. విపక్ష పార్టీలు మా ప్రభుత్వం వైఫల్యం వల్లే దాడి జరిగిందని చెప్పడం సరైంది కాదు. ముంబైలో లా అండ్ ఆర్డర్‌ విఫలమైందని విపక్ష పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం సరికాదు. ఇలా విమర్శంచడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని' అజిత్ పవార్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు