/rtv/media/media_files/2025/02/09/sPlYpHqHQqb5gOIkx9oy.jpg)
manchu vishnu
Kannappa Movie: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
ఫస్ట్ సింగిల్ లోడింగ్..
కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ 'శివ శివ శంకర' సాంగ్ రేపు విడుదల కానున్నట్లు ప్రకటించారు. శ్రీ రవిశంకర్ గురూజీ ఈ పాటను లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేశారు. దీంతో సాంగ్ ఎలా ఉండబోతుందా? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🎶 The countdown is on! ✨
— Kannappa The Movie (@kannappamovie) February 9, 2025
The mesmerizing 'Shiva Shiva Shankara' Lyrical video of the first single from #Kannappa is going to release tomorrow, February 10th! ✨
Get ready to witness the magic! 🔥#ShivaShivaShankara #KannappaFirstSingle #ShivaShivaShankaraLyrical… pic.twitter.com/oNZ4jfeC23
మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఈ స్టోరీలో పలువురు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా.. అక్షయ కుమార్, కాజల్ శివపార్వతులుగా నటించారు. మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితర పాత్రలు పోషించారు. మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు. అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!