బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోపై వివాదం నెలకొంది. ఇటీవల షోకి హాజరైన డైరెక్టర్ బాబీ వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణం. ఆ ఇంటర్వ్యూ నందమూరి ఫ్యాన్స్ లో అగ్గి రాజేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ సాగుతోంది. మ్యాటర్ ఏంటంటే.. అన్‌స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ పేరును, అలాగే ఆయన నటించిన సినిమాల పేర్లను ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించకపోవడంపై చర్చ మొదలైంది. Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా? ఇది తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో దర్శకుడు బాబీ చేసిన అన్ని సినిమాలను ప్రస్తావించగా, ఆయన పని చేసిన హీరోల గురించి బాలకృష్ణ అనేక ప్రశ్నలు అడిగారు. అయితే, బాబీతో చేసిన ఎన్టీఆర్ సినిమా జై లవకుశ గురించి లేదా ఎన్టీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ అంతకుముందు మహేశ్, ప్రభాస్, రామ్‌చరణ్ షోకి వచ్చినప్పుడు కూడా షోలో ఎన్టీఆర్ ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీంతో కావాలనే ఎన్టీఆర్‌ను కార్నర్ చేస్తున్నారంటూ బాలకృష్ణపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్యకు, ఎన్టీఆర్ తో మనస్పర్థలపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పరిణామంతో అది నిజమేనేమో అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.