Jr NTR : ఫ్యామిలీతో లండన్ లో చిల్ అవుతున్న తారక్.. వీడియో వైరల్

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది .

New Update
Jr Ntr Family London Trip

Jr Ntr Family London Trip

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇయర్ 'దేవర' తో భారీ విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 'RRR' లాంటి మల్టీస్టారర్ తర్వాత ఎన్టీఆర్ అందుకున్న సోలో పాన్ ఇండియా హిట్ ఇది.

ఈ సక్సెస్ తో మళ్ళీ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన తారక్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నాడు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని, కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆయన ప్రస్తుతం లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు.

Also Read: పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

లండన్ లో వెకేషన్..

అక్కడ హైడ్ పార్క్‌లో పిల్లలతో కలిసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తారక్ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. సెలెబ్రేషన్స్ అయిపోగానే తిరిగి ఇండియాకు రానున్నారు.

వచ్చిన వెంటనే షూటింగ్ తో బిజీ కానున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దీని   తరువాత, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు