జాన్వీ కపూర్‌ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్

దేవర మూవీలోని చుట్టమల్లె సాంగ్ షూట్‌లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది చాలా ప్రమాదకరంగా అనిపించిందని చెప్పింది. తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని చీరతప్ప మరేమిలేదని తెలిపింది.

New Update
Janhvi Kapoor,

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన కొత్త సినిమా ‘దేవర’. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదిరిపోయే రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో సినీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అందచందాలతో తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. యాక్టింగ్ విషయంలో ఇరగదీసేసింది. సాంగ్‌కు తగ్గ స్టెప్పులతో దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా ఈ మూవీలోని ‘చుట్టమల్లె’ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇందులో జాన్వీ తడిసిన అందాలతో కుర్రకారుని ఫిదా చేసింది. ఆమె అందానికి ఆడియన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యారనే చెప్పాలి. 

ప్రాణాలకే ప్రమాదం అనిపించింది

అయితే ఈ సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో.. దీని వెనుక జరిగిన షూటింగ్ జాన్వీ కపూర్‌ ప్రాణానికి ప్రమాదకరంగా మారింది. అందుకు సంబంధించిన ప్రమాదకర సంఘటనను జాన్వీ కపూర్ తాజాగా ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఈ మేరకు చుట్టమల్లె సాంగ్ షూటింగ్ థాయ్‌లాండ్లో జరగగా.. అందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ ఆమె ఎదుర్కొన్న భయంకరమైన విషయాల్ని చెప్పింది. 

తాను జెల్లీ ఫిష్‌లతో నిండిన నీటిలోకి దిగానని.. అది తనకి చాలా ప్రమాదకరంగా అనిపించిందని ఆ వీడియోలో చెప్పింది. ఆ సమయంలో తనని ప్రొటెక్ట్ చేసుకునేందుకు సన్నని పట్టుచీర తప్ప మరేమి లేదని తెలిపింది. అంతేకాకుండా మరికొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అందులో షూట్ లొకేషన్‌కు చేరుకోవడానికి తాను నీటిలో ఉన్న పదునైన రాళ్లను సైతం ఎక్కాల్సి వచ్చిందని తెలిపింది. ఇది చాలా కష్టమైన షూట్ షెడ్యూల్ అయినప్పటికీ జాన్వీ తన అభిమానుల కోసం చాలా ఆనందంగా పూర్తి చేసిందని చెప్పాలి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Also Read :  హీరోయిన్‌తో నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్.. చాలా క్యూట్ ఉన్నారు కదా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Priya Prakash: అక్కడ ట్యాటూ తో ప్రియా వారియర్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటో షూట్

ప్రియా ప్రకాష్ వారియర్ ట్యాటూలతో ఫోజులిస్తూ స్టన్నింగ్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ప్రియా అందాలకు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు