/rtv/media/media_files/2025/01/08/5vCGrGNdC4z11VsgLPCc.jpg)
allu arjun
పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడని అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అల్లు అర్జున్ తదుపరి సినిమా అప్డేట్ గురించి ఎప్పుడు ప్రకటిస్తారని వేచి చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఓ నెగిటివ్ రోల్‌లో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ద్విపాత్రాభినయంలో ఒకటి హీరో రోల్, ఇంకోటి విలన్ రోల్‌లో నటించబోతున్నట్లు సమాచారం. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
నెక్ట్స్ మూవీ ప్లాన్..
అల్లు అర్జున్ దుబాయ్‌లో అట్లీ దర్శకత్వం వహించనున్న తన నెక్ట్స్ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావచ్చని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన దీనిపై ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ మెయిన్ విలన్‌గా కనిపిస్తాడా? లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటారా? అనే విషయం క్లారిటీ లేదు.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
బడ్జెట్‌లతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో అట్లీ టీమ్ బిజీగా ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజున ఏప్రిల్ 8న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించనున్నాడు.
ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?
అల్లు అర్జున్ స్వయంగా మెయిన్ విలన్‌గా కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే ఈ మూవీకి అనిరుధ్ సంగీతం, నేపథ్య సంగీతం అందించనున్నాడు. సన్ పిక్చర్స్ మూవీని నిర్మించనున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు భారీ ఎనౌన్సమెంట్ ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని, అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ ఈ చిత్రానికి భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం