Jwala Gutta: నితిన్‌ మూవీ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది: గుత్తా జ్వాలా

నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేయడంపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. నితిన్ కోసమే అందులో భాగమయ్యా అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

New Update
Gutta Jwala sensational comments about Nithin gunde jaari gallanthayyinde movie

Gutta Jwala sensational comments about Nithin gunde jaari gallanthayyinde movie

యంగ్ హీరో నితిన్ గతంలో నటించిన ఒక సినిమాపై భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ కుమార్ కొండా - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఆమె.. తాజా ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడారు. తనవల్లే ఆ సినిమా హిట్ అయిందని అన్నారు. అయితే ఆ సినిమాలో కేవలం నితిన్ కోసం మాత్రమే తాను యాక్ట్ చేసినట్లు తెలిపారు. 

ఇది కూడా చూడండి: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉంటారో తెలుసు

నితిన్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందు ఎన్నో అవకాశాలు వచ్చాయని అన్నారు. తాను బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్నప్పుడు సినిమా ఆఫర్లు వచ్చాయని.. కానీ వాటిని తిరస్కరించానని తెలిపారు. తనకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఫ్రెండ్ ఉన్నారని.. ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వాళ్లను చూస్తే అర్థం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి తాను వారిలా ఉండలేనని.. సినిమాల్లో ఉండాలనుకుంటే అన్నీ మారాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

సిగ్గు ఉండకూడదు

సిగ్గు ఉండకూడదన్నారు. ఇక నితిన్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. ఓసారి తామంతా ఓ పార్టీలో ఉండగా.. తన సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. అందులో డ్యాన్స్ చేయమని తనను అడిగాడని అన్నారు. దానికి తాను ఓకే చెప్పానని.. కానీ దానిని సీరియస్‌గా తీసుకోలేదని తెలిపారు. 3 నెలల తర్వాత నితిన్ మళ్లీ తనను కలిసి పాట ఫైనల్ అయిందని చెప్పాడంతో తాను చేయలేనని అన్నట్లు చెప్పారు. 

ఇబ్బందిగా ఉంటుంది

దానికి నితిన్ ఒప్పుకోలేదని.. చివరికి అతడి కోసమే ఆ సినిమాలో యాక్ట్ చేశానని తెలిపారు. అయితే ఆ సినిమా వల్ల నితిన్‌కు మంచే జరిగిందని అన్నారు. అప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడలేదని.. కానీ తాను భాగమైన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా మాత్రం మంచి హిట్ అయిందని తెలిపారు. అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని కాస్త స్మైల్ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

NC 24 Update: హారర్ బాట పట్టిన నాగ చైతన్య.. 'NC 24' పై క్రేజీ అప్‌డేట్

తండేల్ విజయంతో జోష్‌లో ఉన్న నాగ చైతన్య, కార్తీక్ దండు డైరెక్షన్‌లో 24వ సినిమా ప్రారంభించారు. మిథికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతన్య కొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

New Update
NC 24 Update

NC 24 Update

NC 24 Update: తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ చైతన్య(Naga Chaitanya), అదే జోష్‌తో తన 24వ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సుకుమార్ రైటింగ్స్ తో కలసి నిర్మిస్తున్నారు.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌లో, చైతన్య, మీనాక్షి సహా కీలక నటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ సుమారు 15 రోజులు కొనసాగనున్నట్లు తెలిసింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

హారర్ థ్రిల్లర్‌గా సాగే.. 

ఇది హారర్, ఆధ్యాత్మికత, మిథాలజీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందుతోంది. నాగ చైతన్య ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయని కొత్తరకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి తీసుకుంటున్నారు. సినిమాటోగ్రఫీని షామ్ దత్ హ్యాండిల్ చేస్తున్నారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

ఇప్పటికే క్రేజీ కాంబినేషన్‌గా మారిన ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తయి థియేటర్లలో విడుదల అయ్యే వరకు, ఫ్యాన్స్ ఎదురుచూపులు తప్పవు!

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

Advertisment
Advertisment
Advertisment