'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రంగంలోకి 1600 మంది పోలీసులు

'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్‌ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌ కోసం 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్‌ సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.

New Update
game changer pre release event

హైదరాబాద్‌ సంధ్యా థియేటర్‌లో జరిగిన 'పుష్ప-2' బెనిఫిట్‌ షో ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రాబోయే 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ రాజమండ్రిలో నేడు (శనివారం) సాయంత్రం జరుగనుంది.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, అలాగే ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌ కోసం 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్‌ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. 

Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్

ఈ వేడుకకు దాదాపు లక్ష మంది అభిమానులు హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు. పోలీసు అధికారులు ముందస్తుగా వేదిక చుట్టూ పకడ్బందీ చర్యలు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లు, హైమాక్స్‌ లైట్లు, క్లియర్ ప్యాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. వేదిక సమీపంలో 20,000 వాహనాలు నిలపగలిగేలా ఐదు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు గుర్తించారు.

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తరువాత ఆయన అటెంట్ అవుతున్న తొలి ఈవెంట్ ఇదే. అది రామ్ చరణ్ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్  ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. 

Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు