Devi Sri Prasad: కోలీవుడ్ హీరో సూర్య(Surya) నటించిన ‘కంగువా’(Kanguva) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో బీజియం కోసం భరించలేనంత సౌండ్ యూజ్ చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై తాజాగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ స్పందించారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
ట్రోల్స్ పట్టించుకోను - Devi Sri Prasad
ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.." సోషల్ మీడియాలో ట్రోల్స్(Social Media Trolls)ను నేను పెద్దగా పట్టించుకోను. నా పనిని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తాను. ఏది చేసినా విమర్శించే వారు ఉంటారు. కానీ ‘కంగువా’ ఆల్బమ్ నాకు చాలా ప్రత్యేకం. ఇందులోని ‘మణిప్పు’ పాటకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. సూర్య అభిమానులు ఈ పాటలను ఎంతో ఆస్వాదించి సెలబ్రేట్ చేసుకున్నారు.
సూర్య గారు కూడా నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పాటల గురించి అరగంట పాటు మాట్లాడారు. నా పనిని ప్రశంసించారు. ప్రతి సినిమాలో మంచి, చెడు అనే అంశాలు ఉంటాయి. కానీ ‘కంగువా’ టీమ్ ఎంత కష్టపడ్డదో, దాని విజువల్స్ నుంచి సూర్య నటన వరకూ అన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి ఈ సినిమా నచ్చకపోయినప్పటికీ, మేం చేసిన పనిపై గర్వంగా ఉంది.." అని దేవీశ్రీ ప్రసాద్ అన్నారు.
Also Read : వందకోట్ల క్లబ్ లో చేరిన 'డాకు మహారాజ్'.. సంక్రాంతి విన్నర్ గా బాలయ్య
కాగా ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డుల(Oscar Award) బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 97వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో ‘కంగువా’ పోటీ పడనుంది. దీనికి సంబంధించిన నామినేషన్‌స్ షార్ట్‌లిస్ట్ జనవరి 19న రానుంది.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్