Devara : మమ్మల్ని క్షమించండి.. అభిమానులకు తారక్ సారీ!

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినందుకు అభిమానులను క్షమాపణలు కోరారు ఎన్టీఆర్. ఈ రోజుకోసం తాము ఎంతో ఆతృతగా ఎదరుచూశామన్నారు. కానీ ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పుతుందని ముందస్తు జాగ్రత్తతో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు. 

author-image
By srinivas
New Update
dvr

NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైన సందర్భంగా అభిమానులను ఎన్టీఆర్ క్షమాపణలు కోరారు. అందరిలాగే తాము ఈ చిత్రం కోసం సంవత్సరాలుగా కష్టపడి ఈ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఈ వేడుకను భారీ స్థాయిలో జరుపుకోవాలని కోరుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. 

ప్రతి ఒక్కరి భద్రత కోసం కఠిన నిర్ణయం.. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ గణేష్ నిమార్జనానికి చాలా దగ్గరగా షెడ్యూల్ చేయబడింది. ఇలాంటి పెద్ద  ఈవెంట్లకు సాధారణంగా కనీసం ఒక వారం ప్రిపరేషన్ అవసరం. దీనికి తోడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అనేక సవాళ్లను సృష్టించాయి. ఈరోజు వర్షం పడనప్పటికీ, మేము ప్లాన్ చేసినప్పటికీ బహిరంగ కార్యక్రమం జరగడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మేము ఎంత ప్రయత్నించినా అభిమానులు భారీగా తరలివచ్చారు. విపరీతమైన జనం కారణంగా బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో ప్రతి ఒక్కరి భద్రత కోసం మేము ఈవెంట్‌ను రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

మీలో చాలా మంది మీ హీరోని కలుసుకోవడానికి, చూడటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించి వచ్చారని మేము అర్థం చేసుకున్నాం. అందరూ సురక్షితంగా ఉన్నారని, సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఈ అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. ఈ పరిస్థితికి నిజంగా చింతిస్తున్నాం. అవగాహనతో అర్థం చేసుకుంటారని, మీ మద్దతు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ‘దేవర’ టీమ్ తరఫున ధన్యవాదాలు చెప్పారు తారక్. 

Alsio Read :  రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు