Posani Krishna Murali: జనసైనికుల పవర్.. పోసానికి దిమ్మతిరిగే షాక్.. ఏకంగా 5 కేసులు

నటుడు పోసాని కృష్ణమురళీ చిక్కుల్లో పడ్డారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 5కేసులు నమోదు అయ్యాయి.

New Update
Posani Krishna Murali

ప్రముఖ డైలాగ్ రైటర్, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉన్న నటుల్లో పోసాని ఒకరు. అప్పట్లో పలు సినిమాలకు డైలాగ్‌లు రాసి పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో నటించి తన యాక్టింగ్‌తో అదరగొట్టేవారు. గుక్క తిప్పకుండా పవర్ ఫుల్ డైలాగ్‌లు చెప్పి సినీ ప్రియులను ఆకట్టుకునేవారు. 

ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

ఇప్పుడు పోసాని వేరు

అయితే ఒకప్పుడు పోసాని కృష్ణ మురళి వేరు.. ఇప్పుడు పోసాని కృష్ణ మురళి వేరనే చెప్పాలి. ఇప్పుడంతా ఆయనపై నెగిటివిటీనే ఉంది. దానికి ముఖ్య కారణం.. ఆయన మాట్లాడిన విధానమే. పలు ప్రెస్ మీట్‌లలో పోసాని మాట్లాడే విధానం చాలా మందికి నచ్చేది కాదు. దానికి తోడు సినీ ఫీల్డ్ నుంచి రాజకీయంగా అడుగుపెట్టిన తర్వాత అతడిపై మరింత నెగిటివిటీ వచ్చింది. 

ప్రస్తుతం వైసీపీ తరఫున పలు ప్రెస్ మీట్‌లలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రెస్ మీట్‌లలో ఆయన మాట్లాడిన మాటలు.. ఇప్పుడు చిక్కుల్లో పడేశాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా మరికొంత మంది ముఖ్య నాయకులపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. 

Also Read :  డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

22 చోట్ల ఫిర్యాదులు

అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. సోషల్ మీడియా, మీడియాలో ఎవరెవరైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే నటుడు పోసానిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో అనుచిత వాఖ్యలు చేయడంపై గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 22 చోట్ల పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు వచ్చాయి. 

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట!

5 చోట్ల పోలీసులు కేసులు

టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేశారు. ఈ 22 ప్రాంతాల్లో ఫిర్యాదులో భాగంగా 5 చోట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను సైతం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా మరోవైపు సినీ నటి శ్రీరెడ్డిపై సైతం పలు పోలీస్టేషన్‌లలో ఫిర్యాదులు చేయగా.. వాటిలో మూడు కేసులు నమోదయ్యాయి. 

Also Read :  ఏపీలో త్వరలో కొత్త పింఛన్లు...వారికి మాత్రం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు