Chiranjeevi: అడ్వెజరీ బోర్డ్‌ లో భాగం కావడం సంతోషంగా ఉందంటూ..మోదీకి థ్యాంక్స్‌ చెప్పిన మెగాస్టార్‌!

అడ్వైజరీ బోర్డ్‌ లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి మెగాస్టార్‌ చిరంజీవి థ్యాంక్స్‌ చెప్పారు.భారత్‌ ను గ్లోబల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ హబ్‌ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ ను నిర్వహించనుంది.

New Update
chiranjeevi

chiranjeevi

భారత్‌ ను గ్లోబల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ హబ్‌ గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ ను నిర్వహించనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖ నటీనటులు , వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమ్మిట్‌ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.

Also Read: Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్!

తాజాగా ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పోస్ట్‌ పెట్టారు.మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు.అడ్వైజరీ బోర్డ్‌ లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Also Read:  Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ సమ్మిట్‌ కోసం అడ్వైజరీ బోర్డ్‌ లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది.మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇక ఈ సమావేశంలో అమితాబ్‌ బచ్చన్‌ ,మిథున్‌ చక్రవర్తి, రజనీకాంత్‌ ,చిరంజీవి,నాగార్జున,షారుక్‌ ఖాన్ అమిర్‌ ఖాన్‌ అక్షయ్‌ కుమార్‌ అనిల్‌ కపూర్‌ అనుపమ్‌ ఖేర్‌,హేమామాలిని,దీపిక పదుకొణె లతో పాటు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ,ఆనంద్‌ మహీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌ పై వారి అభిప్రాయాలు పంచుకున్నారు.

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

Also Read: RC16 Latest Updates: క్రికెట్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో చెర్రీ మూవీ..హింట్‌ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment