/rtv/media/media_files/2025/02/20/qqFW7aRqlhh8CxvdTfS6.jpg)
chiranjeevi - surekha wedding anniversary Celebrating
Chiranjeevi-Surekha: టాలీవుడ్‌లో ఉన్న అత్యంత ఆదర్శ దంపతుల్లో మెగాస్టార్ చిరంజీవి - సురేఖ జంట ఒకటి. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక చిరు సైతం తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తరచూ చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా తన భార్య సురేఖ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. ఇక ఇవాళ చిరంజీవి-సురేఖల పెళ్లి రోజు. ఈ సందర్భంగా చిరంజీవి - సురేఖ దుబాయ్ మార్గమధ్యంలో కొంతమంది ప్రియమైన స్నేహితులతో విమానంలో తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
రేర్ పిక్
అదే సమయంలో చిరు తన భార్య సురేఖకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ కొన్ని ఫొటోలను పంచుకున్నారు. అందులో అక్కినేని నాగార్జున, ఆయన సతీమని అమల, అలాగే మహేశ్ బాబు భార్య నమ్రత కూడా ఉండటం గమనార్హం. ఇదొక రేర్ పిక్ అనే చెప్పాలి. ఇక చిరూ తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. ‘‘సురేఖలో నా కలల జీవిత భాగస్వామిని కనుగొన్నందుకు నేను ఎల్లప్పుడూ చాలా అదృష్టవంతుడిని అని నేను భావిస్తున్నాను.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
ఆమె నా బలం, నా యాంకర్, నా రెక్కల క్రింద ఉన్న గాలి. ప్రపంచంలోని అద్భుతమైన తెలియని వాటి గుండా నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది. ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది. అద్భుతమైన ప్రేరణనిస్తుంది. ఆమె నాకు ఎంత అర్థమైందో, ఆమె అంటే ఏమిటో కొంచెం వ్యక్తపరచడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను!’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Celebrating our wedding anniversary on a flight with some very dear friends
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025
en route Dubai ! 🎉
I always feel I am very fortunate to have found a dream life partner in Surekha.
She is my strength, my anchor and the
wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
1980లో పెళ్లి
కాగా సురేఖ మరెవరో కాదు.. కమెడియన్, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అల్లు రామలింగయ్య కూతురు. చిరంజీవి ఓ సారి అల్లు రామలింగయ్య ఇంటికి అతిథిగా వెళ్లారు. అక్కడే సురేఖకి, అలాగే వారి ఫ్యామిలీకి చిరు నచ్చేశాడు. దీంతో చిరు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి కుదుర్చుకున్నారు. వీరికి 1980లో పెళ్లి జరిగింది. ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు వీరి సంతానం. వారే సుస్మిత, శ్రీజ, రామ్ చరణ్‌లు.