Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వారే.. చిరంజీవి సంచలన ట్వీట్!

ఇటీవలే తమన్ ''సినిమాను చంపేయ‌కండి''అంటూ నెగిటివ్ ట్రోల్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఈవ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.''తమన్ నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. నీమనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటావు అని ట్వీట్ చేశారు.

New Update
chiranjeevi tweet on thaman

chiranjeevi tweet on thaman

Chiranjeevi: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవలే డాకూ మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో ''సినిమాను చంపేయకండి''  అంటూ నెగిటివ్ ట్రోల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈవ్యాఖ్యలపై  మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమ మంచిని కోరుతూ తమన్ మాట్లాడిన తీరును ప్రశంసించారు. "డియర్ తమన్ నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే  నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది అంటూ ట్వీట్ చేశారు.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!

అసలు తమన్ ఏమ్మన్నారంటే.?

తమన్ నెగిటివ్ ట్రోల్స్ గురించి  మాట్లాడుతూ.. ఒక సక్సెస్ వచ్చినదని చెప్పాలంటే  కూడా.. ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ది కావడంలేదు. అలా చెబితే అతడి పై మళ్ళీ ఏదో నెగెటివ్ గా ట్రోల్ చేయడం,  ట్రెండ్ చేయ‌డం జ‌రుగుతుంది. మీరు చేసే నెగటివ్ ట్రోల్స్ వల్ల నిర్మాతల జీవితాలపై ఎఫెక్ట్ పడుతుంది. మన సినిమాను మనమే చంపేసుకుంటుంటే ఏం బ్ర‌తుకు బ్ర‌తుకుతున్నాం అనేది అర్థం కావడంలేదు. విపరీతమైన ట్రోల్ల్స్ వల్ల బాధగా ఉంది.  ఒక సక్సెస్ ను ఓపెన్ గా చెప్పుకోలేకపోతున్నాము. ఇది ఎంత దురదృష్టకరం.. మీరు పర్సనల్ గా కొట్టండి.. కానీ సినిమాను చంపేయకండి. అదే నేను వేడుకుంటున్నాను అంటూ  చెప్పారు తమన్. 

Also Read: NTR Death Anniversary: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద తారక్, కల్యాణ్‌ రామ్‌ నివాళి.. అక్కడ ఎన్టీఆర్ ఏం చేశారో చూడండి!

Advertisment
Advertisment
Advertisment