/rtv/media/media_files/2025/03/27/aethlS6RXV5aT7WVviUW.jpg)
chiranjeevi about peddi first look
నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా అతడికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి.. చరణ్‌కు విషెశ్ చెబుతూ ‘పెద్ది’ సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!
ఫస్ట్ లుక్ అదిరిపోయింది
తన తనయుడు రామ్ చరన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు అతడు ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్టు చేశారు. ‘పెద్ది’ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయింది అని అన్నారు. పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ అద్భుతంగా ఉందని తెలిపారు. ఇది తప్పకుండా సినీ ప్రియులకు ఒక మంచి ట్రీట్ కానుందని ఆయన ఆకాంక్షించారు.
Happy Birthday
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025
My dear @AlwaysRamCharan !💐💐 Many Many Happy Returns!! 🤗 #Peddi looks very intense and I am sure it will bring out a new dimension of the Actor in you and will be a feast for Cinema lovers and Fans!! Bring it on!!! 😍
ఈ మేరకు హ్యాపీ బర్త్ డే డియర్ చరణ్ అంటూ.. ‘పెద్ది’ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుందని అన్నారు. చరణ్‌లోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుందని తెలిపారు. అందువల్ల ఇది అభిమానులకు కన్నుల పండుగ కానుందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read : వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్
పెద్ది ఫస్ట్ లుక్
మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ #RC16 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈరోజు చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు చరణ్ లుక్ రివీల్ చేశారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ఫైనల్ చేశారు. టైటిల్ కి తగ్గట్లే ఇందులో చరణ్ లుక్ కూడా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు.
Also Read : అమెరికాలో RWA పై ఆంక్షలు..!
స్పోర్ట్స్ డ్రామా
ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇటీవలే మైసూర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్.. అక్కడి నుంచి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
Also read : పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.