/rtv/media/media_files/2025/04/10/5L0ndx7jUdr1FVbJicE8.jpg)
Chhaava movie streaming on netflix april 11
ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజై బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ‘ఛావా’ అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఎవరి అంచనాలకు అందనంత భారీ హిట్ అయింది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి
ఛత్రపతి శివాజీ మరణానంతరం ఆయన కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ మొగల్ సేనను ఎలా ఎదుర్కొన్నాడు?.. ఆ సమయంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి?.. శత్రుసైన్యంతో కుమ్మక్కై ద్రోహం చేసిందెవరు? అనేది దర్శకుడు అత్యద్భుతంగా చూపించాడు. ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా అలరించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎన్నో వివాదాలు, విమర్శలు వచ్చాయి.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
కానీ ఈ సినిమాకి కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక థియేటర్లలో దూసుకుపోయిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ వారికి అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
— Netflix India (@NetflixIndia) April 10, 2025
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
Chhava OTT Date
మూవీ యూనిట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీంతో ఏప్రిల్ 11 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ ఫ్లిక్స్ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.
Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా?
(latest-telugu-news | net-flix | Chhaava Telugu Version | Chhaava movie | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news)