New Update
/rtv/media/media_files/2025/03/25/3iqS5FwiZWp43kvUDg7O.jpg)
celebrity betting apps case big twist
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది సినీ నటీ నటులపై కేసులు నమోదు చేశారు.
Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
అందులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సహా మరెంతో మంది నటీ నటులపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులను సైతం నిందితులుగా చేర్చారు.
నిందుతులుగా యాప్‌ల నిర్వాహకలు
మొత్తం 19 యాప్‌ల పేర్లను నిందితుల లిస్ట్‌లో జతచేశారు. అందులో ఏ23, జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, వీవీబీబాక్, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, వీఎల్‌బుక్, మామ247, తాజ్77, ధని బుక్365, యోలో247డాట్‌కామ్, తెలుగు365, యెస్365, జై365, వీవీబుక్, ఓకేవిన్, పరిమ్యాచ్, తాజ్777బుక్, జెట్‌ఎక్స్, ఆంధ్రా365 తదితర యాప్‌ల పేర్లను చేర్చారు. అయితే సినీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకున్నట్లు తెలిసింది.
Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...
అయితే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ నిర్వాహకులు వేర్వేరు పేర్లతో యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. వీటన్నింటికి బెట్టింగ్ యాప్‌లే మూల కారణం కాబట్టి.. వాటి నిర్వాహకుల్ని నిందుతులుగా చేర్చి విచారణకు పిలవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Also Read: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
పలు కోణాల్లో నిర్వాహకుల్ని విచారించిన తర్వాత.. వారి నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఎవరెవరు తెలంగాణ నిబంధనలను ఉల్లంఘించారో అనే విషయం తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పోలీసులు ప్రస్తుతం సదరు యాప్‌ల నిర్వాహకులను వెతికే పనిలో ఉన్నారు.
(betting-app | Betting App Gang | latest-telugu-news | telugu-news)
తాజా కథనాలు