ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి గురించి అందరికీ తెలిసిందే. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేయడానికి ముందు ఉండేవాడు. వేలకు వేలు, లక్షలకు లక్షలు విరజల్లేవాడు. అలా చేస్తూ వీడియోలతో బాగా పేరు సంపాదించుకున్నాడు. అతడికి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనే డౌట్ అందరిలోనూ కలిగింది. ఆ టైంలోనే అతడిపై బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు వచ్చాయి. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడని ఎంతోమంది ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
దీంతో హర్షసాయి పేరు మరింత మారు మోగిపోయింది. దీని తర్వాత అతడిపై అత్యాచారం కేసు ఒకటి నమోదు అయింది. హర్షసాయి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తనను వాడుకున్నాడని.. దాదాపు రూ.2కోట్లు తనవద్ద తీసుకున్నాడని ఓ యువతి కేసు పెట్టింది. ఆ సమయంలోనే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పేరు బయటకొచ్చింది. దీంతో హర్షసాయికి ఇమ్రాన్ కి మధ్య సంబంధం ఏంటి? అనే డౌట్ అందరిలోనూ కలిగింది. హర్షసాయిని అరెస్టు చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టగా అతడు పరార్ అయ్యాడు. అతడికి ఇమ్రానే సెల్టర్ ఇచ్చాడని వార్తలు జోరుగా సాగాయి. ఆ కేసు పాజ్ అయ్యాక హర్షసాయి మళ్లీ బయటకనిపించాడు.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
ఇలా హర్షసాయి ఒక్కో ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే హర్షసాయి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరార్ లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హర్షసాయి rtv ప్రతినిధితో మాట్లాడిన ఒక ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
Harsha sai Audio Leak
ఆడియోలో అతడు మాట్లాడుతూ.. గూగుల్ యాడ్ సర్టిఫికేట్ తోనే యాడ్స్ ప్రమోట్ చేసినట్లు తెలిపాడు. అయితే తాను మాత్రం ఒకప్పుడు రెస్పాన్స్ బుల్ గానే ప్రమోట్ చేశానని.. ఎలాంటి ఇల్లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని అన్నాడు. దాన్ని అప్పట్లోనే ఆపేసానని చెప్పాడు. అదే సమయంలో ఇమ్రాన్ గురించి మాట్లాడాడు. గతంలో ఓ కేసులో ఇరుక్కున్న సమయంలో ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ పేరును పోలీసులు ప్రస్తావించారని.. అతడికి మీకు ఎలాంటి సంబంధం ఉందని.. అతడు మీ బినామీనా అనే ప్రశ్నపై అతడు నోరు విప్పాడు. ఇమ్రాన్ తన బినామీ కాదని అన్నాడు. అతడు తనను ఇష్టపడే ఒక పర్సన్ అని.. అప్పుడప్పుడు కలుస్తాం అని చెప్పుకొచ్చాడు.
అలాగే నా అన్వేష్ ప్రస్తావన కూడా వచ్చింది. అతడు మీరు ఫ్రెండ్సా అనే ప్రశ్నకు.. అతడు కాదని సమాధానం ఇచ్చాడు. ఇప్పటి వరకు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఎంతోమంది పేర్లు బయట పెట్టాడు కానీ మీ పేరు ఎందుకు బయటపెట్టలేదని అడిగిన ప్రశ్నపై.. అన్వేష్ తన ఫ్రెండ్ కాదని అన్నాడు. తాను ఎప్పుడూ తప్పుడు యాడ్స్ చేయలేదని.. డబ్బులతో బెట్టింగ్ ఆడండి అని చెప్పలేదని తెలిపాడు. దీంతో పాటు అతడు మరెన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. మరిన్ని విషయాలకోసం పైనున్న ఆడియో వినండి.