Bandla Ganesh: పవన్‌ను అంటే ఊరుకునేది లేదు.. డబ్బుల్లేకపోతే అది మీ తప్పు: నిర్మాత వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఫైర్!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో తాను రూ.100 కోట్లు మోసపోయానన్న నిర్మాత శింగనమల రమేష్ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందించారు. సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు అని అన్నారు. మీకోసం పవన్ మూడేళ్లపాటు ఏచిత్రం చేయకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు.

New Update
Bandla Ganesh Serious Warning to Producer Singanamala Ramesh babu

Bandla Ganesh Serious Warning to Producer Singanamala Ramesh babu


టాలీవుడ్ అగ్ర హీరోల కారణంగా తాను చాలా నష్టపోయానని తాజాగా ప్రముఖ సినీ నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు. పవన్ కళ్యాణ్‌తో ‘కొమురం పులి’, మహేశ్ బాబుతో ‘ఖలేజా’ వంటి సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మించానని.. అంతేకాకుండా అప్పట్లోనే ఈ సినిమాల చిత్రీకరణకు 3 ఏళ్లు పట్టిందని తాజా ప్రెస్‌మీట్‌లో నిర్మాత శింగనమల రమేష్ బాబు తెలిపారు.

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

ఈ రెండు సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయానని అన్నారు. అలాగే తాను ఓ కేసులో అరెస్టైనప్పుడు కనీసం ఒక్క హీరో కూడా తనకు ఫోన్ చేసి పలకరించలేదని.. ఎలా ఉన్నావని అడగలేదని ఆవేదనకు గురయ్యారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్ కావడంతో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. 

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు

ఈ మేరకు నిర్మాత రమేష్ బాబును ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. శింగనమల రమేష్ మీరు సినిమాను సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయారు అని అన్నారు. మీ వల్ల పవన్ కళ్యాణ్ 3ఏళ్ల పాటు ఏ సినిమా చేయకుండా ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీరు రాద్ధాంతం చేసుకోకండి అని తెలిపారు.

 

Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!

ఆయన ట్వీట్ ఇలా.. ‘‘సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు. మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు’’ అని రాసుకొచ్చారు. ఈ విషయంపై బండ్ల గణేష్ స్పందించడంతో పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఆయనపై బండ్ల గణేష్ ఈగ కూడా వాలనివ్వరని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు