క్లింకార ఫొటోను ఆరోజే రివీల్ చేస్తా.. బాలయ్య, చరణ్ 'అన్ స్టాపబుల్' ప్రోమో అదిరింది

రామ్ చరణ్ ఇటీవల 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఇందులో చరణ్ తన కూతురి గురించి మాట్లాడారు. ప్రభాస్ తో ఫోన్ కాల్ సంభాషణ కూడా చూపించారు. ఈ ఎపిసోడ్‌లో శర్వానంద్, దిల్ రాజు సైతం సందడి చేశారు.

New Update

ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న బాలకృష్ణ "అన్‌స్టాపబుల్" షో సీజన్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది ఎపిసోడ్‌లు రాగా, తాజాగా తొమ్మిదో ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో రామ్ చరణ్, శర్వానంద్, దిల్ రాజు, నిర్మాత విక్రమ్ హాజరై సందడి చేశారు. "గేమ్ ఛేంజర్" ప్రమోషన్‌లో భాగంగా చరణ్ ఈ షోలో పాల్గొన్నారు.

ప్రోమో అంతా ఎంతో సరదాగా సాగింది. ఇందులో రామ్ చరణ్ తన తల్లి, నానమ్మతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. తన కూతురు క్లింకార గురించి మాట్లాడుతూ..' ఆమె చాలా బక్కగా ఉంటుంది, రోజూ రెండు గంటలు తనతో ఆడుకుంటాను' అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ "నీ కూతుర్ని ఎప్పుడూ చూపిస్తావు?" అని ప్రశ్నించగా, "ఆమె నన్ను నాన్న అని పిలిచే రోజు అందరికీ రివీల్ చేస్తాను" అన్నారు.

Also Read : టికెట్ రేట్లు పెంచుతుంది అందుకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

అంతేకాకుండా, ఈ ఎపిసోడ్‌లో శర్వానంద్ తన చరణ్‌తో ఉన్న స్నేహాన్ని, ఉపాసనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. శర్వానంద్, చరణ్, ప్రభాస్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడటం కూడా ప్రోమోలో చూపించారు. దిల్ రాజు కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొని, 'పార్టీ చేద్దాం' అంటూ సందడి చేశారు.

క్లైమాక్స్‌లో, బాలకృష్ణ, రామ్ చరణ్ కలిసి "గేమ్ ఛేంజర్" పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా  పూర్తి ఎపిసోడ్‌ను జనవరి 8న విడుదల చేయనున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Also Read : కింగ్ ఆఫ్ జంగిల్.. 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు