ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆస్కార్ నామినేటెడ్ 'అనుజా' షార్ట్ ఫిల్మ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 'అనుజ' 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరీలో నామినేట్ అయ్యింది.

New Update
anuja short film ott date

anuja short film ott date

ANUJA:  దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్ హిందీలో రూపొందించిన అమెరికన్ చిత్రం 'అనుజ'  ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ తెలియజేస్తూ నెట్ ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత  గునీత్ మోంగా స్టార్ నటి ప్రియాంక చోప్రా నిర్మాతలుగా ఉన్నారు. 

ఆస్కార్ కి ఒక్క అడుగు దూరంలో 

 97వ అకాడమీ అవార్డు కోసం  ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరీలో నామినేట్ అయిన  'అనుజ' షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ కి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. మార్చి 3న జరగనున్న  ఆస్కార్ 2025 అవార్డు విజేతలు ప్రకటించబడతారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఆస్కార్ వేడుకను ప్రత్యక్షంగా చూడవచ్చు. 
 ఇప్పటికే ఈ చిత్రం అనేక అవార్డులను దక్కించుంది.  ఆగస్టు 2024లో జరిగిన హోలీషార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డు, అలాగే  అక్టోబర్ 2024లో జరిగిన న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రైజ్‌ని కూడా గెలుచుకుంది. 'అనుజ'  ప్రపంచ ప్రీమియర్ 2024 జూన్ 8న  24th డెడ్‌సెంటర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగింది. 

షార్ట్ ఫిల్మ్ స్టోరీ.. 

'అనుజ'  షార్ట్ ఫిల్మ్ ఢిల్లీలో నివసిస్తున్న 9 ఏళ్ల బాలిక కథ.  ఈ సినిమా కథ 9 ఏళ్ల అనూజ,  ఆమె 17 ఏళ్ల సోదరి చుట్టూ తిరుగుతుంది. అనూజ అనే 9 ఏళ్ల బాలిక, ఆమె అక్క పాలక్‌తో కలిసి గార్మెంట్  ఫ్యాక్టరీలో పని చేస్తుంది. 9 ఏళ్ల అనూజ జర్నీ ఎలా ఉంటుందో అనేదే సినిమా స్టోరీ. ఆమె తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది ఆమె భవిష్యత్తుతో పాటు ఆమె కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూపించారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శ్రీలీలను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. అంతా షాక్! వీడియో వైరల్

ఇటీవలే ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. దీంతో పక్కన ఉన్నవారు వెంటనే శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update

ఇటీవలే ఓ ఈవెంట్ పాల్గొన్న శ్రీలీలకు ఊహించని షాక్ ఎదురైంది. ఫ్యాన్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు.దీంతో పక్కన ఉన్నవారు వెంటనే శ్రీలీలను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.  

 

latest-news | telugu-news | cinema-news | viral-video

Advertisment
Advertisment
Advertisment