Syamala: నీతులు చెప్పకు పవన్, ఆ ఇద్దర్ని చంపింది నువ్వే.. యాంకర్ శ్యామల సంచలనం!

పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్ర‌మాదంలో ఫ్యాన్స్ చ‌నిపోతే దీన్ని గత ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. మీ కార‌ణంగా ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోతే క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా? అంటూ ప్రశ్నించారు.

New Update
anchor shyamala fires on pawan kalyan

anchor shyamala pawan kalyan

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. 

ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయని గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై యాంకర్ శ్యామల కౌంటర్ ఇచ్చింది. 

పవన్ కళ్యాణ్ నీతులు చెప్ప‌డం వ‌ర‌కే కానీ.. ఆచ‌ర‌ణ‌లో ఉండ‌వు. రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారంటూ పవన్ పై ఫైర్ అయింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో..' డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్ప‌డం వ‌ర‌కే.. ఆచ‌ర‌ణ‌లో ఉండ‌వు. 

గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం  మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారు స‌ర్ SEIZE THE ROAD.. అనాలి క‌దా?.. 

Also Read :  భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

సినిమాల‌కు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈల‌లు వేసి గోల చెయ్యండి అంటూ యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ మీరు మాట్లాడిన మాట‌లు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాట‌లేనా మీ కార‌ణంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతో క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా? అంటే మీ స్వార్థానికి అమాయ‌కుల ప్రాణాలు బ‌లి చేస్తున్నారా?..' అంటూ పోస్ట్ లో పేర్కొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు