Ananya Nagalla: డ్రీమీ అనన్య.. స్కై బ్లూ శారీలో ఈ ముద్దుగుమ్మను చూస్తే ఫ్లాట్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్కై బ్లూ శారీలో అనన్య అందాల హొయలు మతిపోగొడుతున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.
Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందింది. మే 1న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం అంతటి హైప్ కనిపించడం లేదు. ప్రత్యేకంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను చూస్తే, ఇది చాలా యూనిక్‌గా ఉండటంతో మాస్ ఆడియెన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్‌లలో భాగంగా, ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'కింగ్‌డమ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
రెట్రో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు. పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాలో సూర్యా సరసన కథానాయికగా కనిపించనుంది. అలాగే జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, సూర్యా తన భార్య జ్యోతికతో కలిసి తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.
ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా "కనీమా" పాటలో సూర్యా – పూజా హెగ్డేల డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ముందుగానే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమోషన్లు సినిమాపై మరింత హైప్‌ను పెంచేసాయి.
మే 1న 'రెట్రో' థియేటర్లలో ఆకట్టుకోనుంది. యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కలబోతగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.