Ambati Rambabu: నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా?: పవన్ పై అంబటి సంచలన పోస్ట్!

గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.

New Update
Ambati Rambabu react on ram charan fans died

Ambati Rambabu react on ram charan fans died

Ambati Rambabu: ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీ సంద్య థియేటర్ ఘటనను గుర్తు చేస్తూ.. సంచలన పోస్ట్ పెట్టారు. నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేశారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా ! "గేమ్ చేంజర్' కి పాటించరా !’’ అంటూ ట్వీట్ చేశారు.  

ఇది కూడా చూడండి: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమండ్రిలో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత గ్రాండ్ లెవెల్లో జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. ఇక ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంతం కలకలలాడిపోయింది. అయితే గేమ్ ఛేంజర్ ఈవెంట్ అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ బైక్ మీద వెళ్తున్న క్రమంలో వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందారు. 

పవన్ కళ్యాణ్ దిగ్రాంతి 

ఈ విషాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ఈ మేరకు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం అని అన్నారు. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులకు స్పష్టం చేశానని తెలిపారు. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు