/rtv/media/media_files/2025/01/18/IO8nX0ov0NOyiqbQMNKU.jpg)
TV Actor Aman Jaiswal
Aman jaiswal: ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ 23ఏళ్ళ వయసులోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. శుక్రవారం మధ్యాహ్నం ముంబైలోని జోగేశ్వరి రోడ్డు పై వెళ్తుండగా అమన్ బైక్ ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ముంబైలోని కామా ఆసుపత్రికి తరలించగా.. తీసుకెళ్లిన అరగంటకే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
💔 SHOCKING NEWS: #DhartiputraNandini actor #AmanJaiswal tragically passed away in a road accident.
— Vivek Mishra (@actor_vivekm) January 17, 2025
Gone too soon. May his soul rest in peace. 🕊️💐 #RIP #GoneButNotForgotten pic.twitter.com/KfSAD35MBg
'ధర్తిపుత్ర నందిని' సీరియల్ తో గుర్తింపు..
అమన్ జైస్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో జన్మించాడు. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన అమన్ "ధర్తిపుత్ర నందిని" చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రధాన పాత్రతో ప్రసిద్ది చెందాడు. సినిమాలతో పాటు అమన్ సీరియల్స్ లో కూడా నటించాడు. సోనీ టీవీ పాపులర్ సీరియల్ 'పుణ్యశ్లోక్ అహల్యాబాయి’లో యశ్వంత్ రావు పాత్రలో కనిపించాడు. అయితే అమన్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా అతడు బైక్ పైనే వెళ్తాడట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అతడి బైక్ రైడింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. అమన్ అకాల మరణంతో బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్