/rtv/media/media_files/2025/02/20/Hkrdf5nMrgRonlKl9SIn.jpg)
Allu Arjun
పుష్పతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ . హాలీవుడ్ సైతం ఇతని వైపు చూస్తోంది ఇప్పుడు. అందులో భాగంగానే ది హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ బన్నీ కవన్ ఫోటోను వేయడమే కాక..ఇంటర్వ్యూను కూడా ప్రచురిస్తోంది. ఈ మ్యాగజైన్ ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్‌లోనూ అడుగుపెట్టేసింది. దీని తొలి సంచికే అల్లు అర్జున్ కవర్ పేజీతో రానుంది. తాజాగా ఈ కవర్ పేజ్ ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఆ బీటీఎస్ ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు.
ఆసక్తిర అంశాలతో ఇంటర్వ్యూ..
ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున ఆసక్తికర అంశాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ బాక్సాఫీసును కొల్లగొట్టి...తాను నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని బన్నీ చెప్పారు. నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఈ కవర్ పేజీ మీద రావడం, ఇంటర్వ్యూ ఇవ్వడమే అని అన్నారు. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి...వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇవి కూడా అలాంటివే. జీవితంలో ఎంత పెద్ద విజయం సాధించినా వినయంగా ఉండాలి. తాను అలానే ఉంటానని...100 శాతం సామాన్యుడిగానే బతకడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. సినిమాలు చేసినప్పుడు ఓకే...కానీ విరామం దొరికితే మాత్రం తాను ఏమీ చేయనని...కనీసం పుస్తకం కూడా చదవనని చెప్పారు అల్లు అర్జున్. ఇదంతా ఇంటర్వ్యూ మీద రూపొందించిన షార్ట్ వీడియోలో ఉంది. ఈ ప్రోమో ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో మొత్తం ఇంటర్వ్యూ చదవడానికి బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ నేషనల్ వైడ్‌గానే కాకుండా వరల్డ్ వైడ్‌గా దుమ్ము దులిపేసింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలు కొట్టింది. బడా హీరోల సినిమాల రికార్డులను వెనక్కి నెట్టి.. కొత్త రికార్డులను సృష్టించింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని బరిలోకి దిగిన పుష్ప2 ఆ రికార్డును కేవలం 9 రోజుల్లోనే సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పటికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రూ.2000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇలా భారీ కలెక్షన్లతో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి పెద్ద పెద్ద సినిమాల రికార్డులను తుంగలోకి తొక్కింది.
Also Read: USA: ఎన్నికలు లేని నియంత..జెలెన్ స్కీపై ట్రంప్ అటాక్