Pushpa 2: మీరంటే ముద్దు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్

మరో రెండు రోజుల్లో విడుదల అవుతున్న పుష్ప–2 ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని యూసుఫ్‌ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రేమ, పిచ్చి...ఇంతకన్నా ఏం చెప్పలేను అంటూ వాళ్ళకు థాంక్స్ చెప్పారు. 

New Update
11

పుష్ప–2 ప్రీ రిఈజ్ ఈవెంట్‌లో బన్నీ ఎమోషనల్ అయ్యాడు.  పుష్ప–1 అప్పుడు చెప్పాను తగ్గేదే లే అని ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను అంటూ మాట్లాడారు. తన దగ్గరకు పరుగెత్తివచ్చిన ఫ్యాన్‌ను దగ్గరకు తీసుకుని, ఫోటో తీసుకుని మరీ పంపించారు. మూడేళ్ళ క్రితం పుష్ప–1 అప్పుడు ఫ్యాన్స్‌ను కలిశాను, మళ్ళీ ఇప్పుడు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందంటూ బన్నీ స్పీచ్ దంచేశాడు. మై డియర్ ఫాన్స్ ఎంతో ముద్దుగా మీ అందరినీ నా ఆర్మీ అంటుంటాను మై ఆర్మీ మై ఫాన్స్ ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు ఐ లవ్ యు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి అబ్బా అంతకన్నా ఇంకేమీ చెప్పలేను నేను. నా మీద నమ్మకం ఉంచి ఈ మూవీ చేసిన మా నిర్మాతలు నవీన్ గారెకి థాంక్యూ సోమచ్. నేను చెబుతున్నాను ఈ సినిమా వాళ్లు కాకుండా ఇంకా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. మమ్మల్ని ఎంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు కుమ్మరించినందుకు నవీన్ రవి ఇద్దరికీ థాంక్స్ అని ఆయన అన్నారు.

Also Read :  ఏపీలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య

Also Read :  సుందర్ పిచాయ్‌కి షాక్. ఇచ్చిన ముంబయి కోర్టు!

కన్నీళ్ళు పెట్టుకున్న బన్నీ..

అంతకు ముందు దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...కేవలం బన్నీ కోసమే ఈ మూవీ చేసకువచ్చానని చెప్పారు. ఈ పుష్ప అనేది పుష్ప రెండు భాగాలు ఎలా వచ్చింది? ఎలా తయారయింది అంటే ఇది కేవలం అల్లు అర్జున్ మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరి బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు తనకి ఒక సీన్ చెబుతున్నప్పుడు నాకు వచ్చే ఎనర్జీ ఎప్పుడైనా ఒక సీన్ రావాలని పోరాటం చేస్తాడు. మీరందరూ ఒక ఫైట్ కోసమో ఒక సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఇలాంటి హీరోకు డైరెక్షన్ చేయడం అనేది ఒక డైరెక్టర్ కి మామూలు కిక్కు ఇవ్వదు. డార్లింగ్ నువ్వు నమ్ము నమ్మకపో నేను కేవలం నేను సినిమా నీకోసమే చేశాను తప్ప మరో కారణం లేదు. నీ మీద ప్రేమ తప్ప మరో కారణం లేదు అంటూ సుకుమార్ మాట్లాడారు. ఈ మాటలకు అల్లు అర్జున్ ఎమోషనల్ అయి కన్నీళ్​ళు పెట్టుకున్నారు. 

Also Read: PV Sindhu: పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ బ్యాడ్మింట్ ప్లేయర్ పి.వి.సింధు

Also Read :  ఏపీలో ‘పుష్ప2’ టికెట్‌ ధరల పెంపు.. అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు