Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే?

మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 'పుష్ప 2' లో మరో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి టైంకి రీ లోడెడ్ వెర్షన్ తో వస్తుడటంతో మళ్ళీ కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

New Update
pushpa 2 re loaded version

allu arjun pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 5 న రిలీజై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలై ఇప్పటికే నెల రోజులు దాటగా 'బాహుబలి 2' రికార్డు కూడా బద్దలు కొట్టి రూ.1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. 

'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి జనవరి 11 నుంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ వార్త టాలీవుడ్ లో చర్చగా మారింది. నిజానికి రిలీజ్ కు ముందు 'పుష్ప 2' టార్గెట్ రూ. 2000 కోట్లు. కానీ రిలీజ్ తర్వాత సంధ్య థియేటర్ ఘటన తో నిర్మాతలకు పెద్ద దెబ్బ పడింది. 

Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ

ఈ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, పోలీసుల విచారణ.. ఇలా చాలా తతంగమే జరిగింది. దాంతో మూవీ టీమ్ అనుకున్న స్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుమణుగుతున్నాయి. మొన్న బన్నీకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇవ్వాళ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ను కలిశాడు. మొత్తానికి 'పుష్ప2' వల్ల తలెత్తిన వివాదాలన్నీ సమసిపోయాయి. 

రీ లోడెడ్ వెర్షన్..

దీంతో మూవీ టీమ్ అప్పుడు చేయలేకపోయిన ప్రమోషన్స్ ను ఇప్పుడు చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లు కూడా సరైన టైం చూసే ప్లాన్ చేశారు. సంక్రాంతి టైం కి 'పుష్ప2' రీ లోడెడ్ వెర్షన్ తో వస్తున్నారు. కాబట్టి సినిమాకు మళ్ళీ కలెక్షన్స్ ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ ఉంది. నిర్మాతలకు కావాల్సింది కూడా అదే అనుకోండి! మరో 170 కోట్లు కలెక్ట్ చేస్తే 'పుష్ప2' రూ.2000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. మరి రీ లోడెడ్ వెర్షన్ తో 'పుష్ప2' రెండు వేల కోట్ల క్లబ్ లో చేరుతుందేమో చూడాలి.

Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు