/rtv/media/media_files/2025/03/12/4zRtiOSMbs7edV9Du1XA.jpg)
Akkineni Akhil and Murali krishna Abburu new film shooting coming soon
అయ్యగారే నంబర్ వన్.. ఈ డైలాగ్ వింటే మొదటిగా గుర్తొచ్చేది అక్కినేని అఖిల్. ప్రస్తుతం ఈ హీరోకి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పాలి. చేసిన ఏ సినిమా హిట్‌గా నిలవలేదు. అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మజ్ను, ఏంజెంట్ వంటి చిత్రాలు చేశాడు.
కానీ ఇవేవి అఖిల్‌కు మంచి హిట్‌ను అందించలేకపోయాయి. అతడి చివరి సినిమా ‘ఏజెంట్’ ఎన్నో అంచనాలతో రెండేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ రిజల్ట్‌తో అఖిల్ రెండేళ్లు స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే ప్రస్తుతం అతడు ఒక మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇందులో బాగంగానే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
రెండేళ్ల తర్వాత కొత్త సినిమా
ఎట్టకేలకు అతడు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. మార్చి 14 నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
ఈ చిత్రం పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో రూరల్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. అఖిల్ కెరీర్‌లో 6వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జునే స్వయంగా నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే పేరును టైటిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.