Actress Hema : డ్రగ్ టెస్టులో నటి హేమ.. 8 మందికి పాజిటివ్!

టాలీవుడ్ సీనియర్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్న ఆమె, గత కొంతకాలంగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు.

New Update
hema

టాలీవుడ్(tollywood-news-in-telugu) సీనియర్ నటి హేమ(actress-hema) మరోసారి వార్తల్లో నిలిచారు. వైవిధ్యమైన పాత్రలతో దశాబ్దాలుగా మనల్ని అలరిస్తున్న ఆమె, గత కొంతకాలంగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఒక పబ్‌పై జరిగిన పోలీసుల దాడిలో హేమ పేరు వినిపించడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది.

కొండాపూర్‌లోని క్వాక్ ఏరీనా పబ్ పై ఈగల్ టీమ్ తో కలిసి స్థానిక పోలీసులు మెరుపు దాడులు చేశారు. పార్టీ జరుగుతున్న సమయంలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి, అక్కడ ఉన్న 64 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఈ తనిఖీల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఇందులో ఆరుగురు గంజాయి, ఇద్దరు ఇతర డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు.

Also Read :  జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి

సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు

అయితే ఈ పార్టీలో హేమ కూడా ఉండటంతో సహజంగానే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే, ఈసారి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పబ్ నుంచే నేరుగా ఒక వీడియోను విడుదల చేశారు. "మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు.. అనవసరంగా నాపై దుష్ప్రచారం చేయకండి" అని ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.  తనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెబుతూ, అందుకు సంబంధించిన యూరిన్ టెస్ట్ రిపోర్టును కూడా వీడియోలో చూపించి తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాగా ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత హేమ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. డ్రగ్స్ కేసు వల్ల తన కుటుంబ గౌరవం మంటగలిసిందని కన్నీరు పెట్టుకున్నారు. నోటీసులకు స్పందించలేదన్న కారణంతోనే తనను అరెస్ట్ చేశారని, డ్రగ్స్ తీసుకున్నందుకు కాదని స్పష్టం చేశారు. నిజానిజాలు తెలియకుండా మీడియా తనను, తన తల్లిని విమర్శించడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కలిగిందని ఆవేదన చెందారు. గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల దృష్ట్యా, ఈసారి తనపై ఎలాంటి అపవాదు రాకూడదని హేమ ముందస్తుగానే ఆధారాలతో సహా క్లారిటీ ఇచ్చారు.

Also Read :  గూస్ బంప్స్ తెపిస్తున్న 'రామాయణ' టీజర్‌..

Advertisment
తాజా కథనాలు