Shivaji : ఆ మాటలకు మూడు రోజులు నిద్రపోలేదు : శివాజీ

మహిళల డ్రెస్సింగ్ విధానంపై నటుడు శివాజీ గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన కామెంట్స్ పై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

New Update
shivaji

మహిళల డ్రెస్సింగ్(Womens Dressing) విధానంపై నటుడు శివాజీ(shivaji) గతంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శివాజీ చేసిన కామెంట్స్ పై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  అయితే తాను అలా మాట్లాడాల్సి ఉండాల్సిది కాదంటూ శివాజీ తాజాగా అభిప్రాయపడ్దారు. మహిళల డ్రెస్‌ల ఆధారంగా వారి క్యారెక్టర్‌ను నిర్ణయించకూడదని తెలిపారు.  

మహిళల డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడినప్పుడు తాను అనవసరంగా రెండు పదాలను వాడనని,  అలా వాడుకుండా ఉండాల్సింది అని తెలిపారు. తానెప్పుడూ కంట్రోల్‌ లేకుండా మాట్లాడలేదని, ఆరోజు మాత్రం అలా ఎందుకు మాట్లాడానో ఇప్పటికి అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి పదాలు వాడింది తానేనా అని ఇప్పటికి అనిపిస్తుంది అన్నారు శివాజీ. ఈ మాటల వల్ల తానేంతో మానసిక సంఘర్షణకు గురయ్యానని... మూడు రోజులు నిద్ర కూడా పోలేదని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. - Tollywood news updates

Also Read :  సంధ్యా థియేటర్ ఘటనలో చార్జిషీట్ మళ్లీ వెనక్కి.. కోర్టు అభ్యంతరాలు ఇవే!

అనసూయను ఏం అనలేదు

ఇక నటి అనసూయ(Anasuya) ను కూడా తానేమి అనలేదన్నారు శివాజీ. ఆమెతో తనకున్న పరిచయం కూడా తక్కువేనని తెలిపారు. గతంలో ఒకసారి తనను ఇంటర్వ్యూ చేసిందన్నారు. అనసూయ అంటే ఇప్పటికి తనకు గౌరవం ఉందన్నారు శివాజీ. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరు

ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పుకొచ్చారు శివాజీ. మహిళా కమిషన్‌కు తాను వెళ్లినప్పుడు తనకు తెలిసినవాళ్లే తనపై కంప్లైంట్‌ చేశారని చెప్పినప్పుడు షాక్‌ అయ్యానన్నారు.  కానీ వాళ్ల పేర్లు చెప్పనని చెప్పుకొచ్చారు. అలా చెప్పడం కూడా కరెక్ట్‌ కాదని తెలిపారు. వాళ్లంటే తనకంటే ఇప్పటికీ గౌరవం ఉందనన్నారు. - tollywood

Also Read :  చెన్నై టు ముంబై.. ఫ్లైట్‌లో ఫుడ్ తెప్పిస్తా: ప్రభాస్

Advertisment
తాజా కథనాలు