Chinmayi Sripada:మళ్ళీ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన చిన్మయి..ఈసారి ఏకంగా సీఎం పైనే సింగర్ చిన్మయి మరోసారి కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. ఈసారి ఏకంగా తమిళనాడు సీఎం స్టిలిన్ మీదనే విరుచుకుపడింది. తనని లైంగికంగా వేధించిన వ్యక్తికి తమిళనాడులో మోస్ట్ పవర్ ఫుల్ మెన్ సపోర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. By Manogna alamuru 02 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Controversial comments:సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఆమె పెద్ద తలకాయల మీదనే అసహనం వ్యక్తం చేసింది. ఇందులో తమిళనాడు సీఎంతో పాటూ కమల్ హసన్, చిదంబరం కూడా ఉన్నారు. అసలేం జరిగిందంటే...ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన మహా కవితై పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. దీనిని తమిళనాడు సీఎం స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, కమల్ హసన్ లు ఆవిష్కరించారు. దీన్ని సింగర్ చిన్మయి తప్పుబట్టింది. తనను లైంగికంగా వేధించిన వ్యక్తిని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటూ బాధపడింది. తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. Also Read:ధర్నా విరమించారు…పెట్రోల్‌కు ఢోకాలేదింక Thodangi? yevangalta nyayathukku poganum? Ivangaltaya? Just check the number of politicians with Vairamuthu alone. How does one get justice in this ecosystem? https://t.co/0ubXKXZq7e pic.twitter.com/xjnVZL0xwb — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 చిన్మయి...సింగర్, డబ్బింగ్ ఆర్టిస్. ఈమె 2018లో తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి బయటపడింది. ఈమెతో పాటూ వైరముత్తు మీద మరికొంతమంది కూడా ఆరోపణలు చేశారు. అయితే ఎవరూ వైరముత్తును ఏమీ అనలేదు కదా తిరిగి చిన్మయినే తమిళ ఇండస్ట్రీ నిషేధించింది. దీంతో పాపం చిన్మయి అప్పటి నుంచి తన ఆవేదనను సమయం వచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వైరముత్తు పుస్తకాన్ని ఆవిష్కరించి, ఈతనికి సపోర్ట్ చేస్తున్నందుకే సీఎం స్టాలిన్, కమల్ హసన్‌ల మీద విమర్శలు చేసింది. Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned - years of my career lost. May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 #chinmayi-sripada #tamilnadu #kamal-hassan #stalin #vairamuttu #me-too మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి