Breaking: ధోనీ ఫ్యాన్స్ కు షాక్.. CSKకు కొత్త కెప్టెన్!

2024 IPL సీజన్ 17లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ ప్రకటించింది.

New Update
Breaking: ధోనీ ఫ్యాన్స్ కు షాక్.. CSKకు కొత్త కెప్టెన్!

New Captain For Chennai Super Kings:  2024 IPL సీజన్ 17లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి ధోనీ (MS Dhoni) తప్పుకున్నట్లు తెలిపింది. ఈ సీజన్ మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) నాయకత్వం వహించనున్నట్లు టీమ్ మెనేజ్ మెంట్ ప్రకటించింది.

ఈ సీజన్‌ ఆరంభానికి కొద్దిరోజుల ముందు ధోని ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన పోస్టు అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. ‘న్యూ రోల్‌’ అంటూ ధోని క్యాప్సన్ పెట్టడంతో సీఎస్కే కెప్టెన్సీ గురించే అంటూ పెద్ద ఎత్తున్న చర్చ మొదలైంది. ‘న్యూ సీజన్‌లో న్యూ రోల్‌ కోసం ఆసక్తికరంగా వేచి చూస్తున్నా. స్టే ట్యూన్డ్‌’ అంటూ పోస్ట్‌ పెట్టగా నెట్టింట వైరల్‌ అయింది.

దీంతో ధోని ధోని కొత్త రోల్‌ అంటే ఓపెనర్‌గా వస్తాడని కొందరు.. కెప్టెన్సీని వదిలేస్తున్నాడని మరికొందరు వాదిస్తుండగా ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ధోని ఈ సీజన్‌లో మెంటార్‌గా ఉండబోతున్నాడంటూ కూడా వాదనలు వినిపించాయి.

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17 లీగ్(IPL 17 League) షురూ కాబోతోంది. శుక్రవారం మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(Royal Challengers Bangalore) తలపడనున్నాయి.

Also Read: హైదరాబాద్ లో డేంజర్ మామిడి పండ్లు.. తింటే మటాషే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CLP meeting : కాంగ్రెస్ MLA ల జీతాలు కట్....పార్టీ కీలక నిర్ణయం

పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25 వేలు తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం వీటిని వినియోగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

New Update
CLP meeting

CLP meeting

CLP meeting :  పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, ప్రతి ఎమ్మెల్యే తమ జీతం నుంచి నెలకి రూ.25,000 విరాళం తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హుకూం జారీ చేసారు. పార్టీ ఆర్థిక అవసరాలు, రాబోయే ఎన్నికల సన్నాహాలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ విరాళాలను వినియోగించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నోవోటెల్‌ వేదికగా జరిగిన CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హస్తం నేతలందరి లక్ష్యం ఒక్కటే అయ్యి ఉండాలని.. రెండోసారి ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :  ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఇక నుంచి ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉండాలని, విస్తృతంగా గ్రామాల్లో పర్యటించాలని రేవంత్‌ సూచించారు.పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకూడదు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని హెచ్చరించారు.భయపడే పరిస్థితిలో పార్టీ లేదు. అద్దంకి దయాకర్‌లాగా అందరూ ఓపికతో ఉండాలి.అద్దంకి దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టే ఎమ్మెల్సీ అయ్యాడని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!

 మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ చూసుకుంటుందని, మంత్రివర్గ విస్తరణ గురించి ఎవరూ బహిరంగంగా బయట మాట్లాడొద్దని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగింది. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు వివరించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

Advertisment
Advertisment
Advertisment