Trai: ఫోన్ నంబర్‌కూ ఛార్జీలు..ట్రాయ్ కొత్త ప్రతిపాదనలు ఫోన్ నంబర్ కావాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది ట్రాయ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఫోన్ నంబర్ల దుర్వినియోగం అరికట్టేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు ట్రాయ్ చెబుతోంది. By Manogna alamuru 14 Jun 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Charges For Phone Numbers: ఫోన్ కొనుక్కున్న తర్వాత సిమ్ తీసుకోవాలంటే కొన్నేళ్ళ క్రితం డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న కారణంగా ఉచితంగా సిమ్ కార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఊరకనే సిమ్ కార్డులు తీసుకోవడం కొన్నాళ్ళు వాడుకోవడం...తర్వాత పక్కన పడేయడం చేశారు. ఇది చాలా ప్రాబ్లెమ్స్‌కు దారి తీసింది. దీంతో ఫోన్ నంబర్ల జారీపై గరిష్ట పరిమితిని విధించింది ప్రభుత్వం. దీంతో కాస్త సిమ్ కార్డుల దుర్వినియోగం తగ్గింది. అయితే వాటిన ఇపూర్తిగా అరికట్టేందుకు ఇప్పుడు ట్రాయ్ మరో అడుగు ముందుకు వేయబోతోంది. దీనికి కొత్త సిఫార్పులు సిద్ధం చేసింది. దీని ప్రకారం మొబైల్ ఫోన్ నంబర్లకూ, ల్యాండ్ లైన్ నంబర్లకు కూడా డబ్బులు చేయాలని భావిస్తోంది ట్రాయ్. దీనికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఒకవేళ కేంద్రం కనుక దీనికి ఆమోదం తెలిపితే ట్రాయ్ మొదట మొబైల్ కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఆ తర్వాత ఆపరేటర్లు ఎలాగూ జనాల నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. ఫోన్ నంబర్లేమీ అపరిమితం కాదని...అందుకే ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇదే కనుక అమల్లోకి వస్తే ఫోన్లవాడే కోట్లాది మంది భారతీయులపై అదనపు భారం పడనుంది. Also Read:Tmili Sai: అబ్బే అదేం కాదు..అమిత్ షాతో మాటలపై క్లారిటీ ఇచ్చిన తమిళిసై #trai #phones #charges #numbers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి